చార్మినార్ అమ్మవారి ఆలయం వద్ద భారీ బందోబస్తు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా భారీగా బలగాలు మోహరించాయి. బోనాల పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని [&hellip;]</p>

Charminar Bhagyalakshmi Temple
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా భారీగా బలగాలు మోహరించాయి. బోనాల పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story