- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాను తలపించిన గోల్డ్ స్మగ్లింగ్.. శంషాబాద్‌లో భారీగా పట్టివేత
<p>దిశ, శంషాబాద్: విదేశాల నుండి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. శుక్రవారం దుబాయ్ నుండి (AI – 952) విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నలుగురు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. సుడాన్ దేశానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులుపై అనుమానం వచ్చి పూర్తిగా స్కాన్ చేయడంతో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారాన్ని ప్రయాణికులు శరీర భాగాళ్లో […]</p>

దిశ, శంషాబాద్: విదేశాల నుండి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. శుక్రవారం దుబాయ్ నుండి (AI – 952) విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నలుగురు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. సుడాన్ దేశానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులుపై అనుమానం వచ్చి పూర్తిగా స్కాన్ చేయడంతో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారాన్ని ప్రయాణికులు శరీర భాగాళ్లో దాచి బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.3 కోట్ల 60 లక్షల ఉంటుందని, సుమారు 7 కిలోల 600 గ్రాములు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నమని తెలిపారు. కాగా, బంగారం తరలింపు ప్రముఖ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమాను తలపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.






