- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది చెరువు కాదు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. దీంతో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు జల దిగ్బంధంలో చిక్కుకుంది. విమానాలు వరద నీటిలోనే నిలిచిపోయాయి. దీంతోపాటు పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. ఈ మేరకు పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు చేశాయి. రాకపోకలు, విమానాలు బయలుదేరడంలో ఆలస్యమయ్యే సూచనలున్నాయని.. ప్రయాణికులు గమనించగలరని సూచించాయి. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. దీంతో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు జల దిగ్బంధంలో చిక్కుకుంది. విమానాలు వరద నీటిలోనే నిలిచిపోయాయి. దీంతోపాటు పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. ఈ మేరకు పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు చేశాయి. రాకపోకలు, విమానాలు బయలుదేరడంలో ఆలస్యమయ్యే సూచనలున్నాయని.. ప్రయాణికులు గమనించగలరని సూచించాయి. అంతేగాకుండా.. భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం సైతం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Next Story






