ఉదయాన్నే వాము, నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్!?

by Jakkula.Mamatha |

చాలా మంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు.

ఉదయాన్నే వాము, నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్!?
X

దిశ,వెబ్‌డెస్క్: చాలా మంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. వైద్యులను సంప్రదించాలంటే చిన్న సమస్యే కదా ఎందుకు అని వదిలేస్తారు. ఈ తరుణంలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో ఇరిటేట్ గా ఫీల్ అయ్యేవారు.. ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. ఈ క్రమంలో వాము నీరు కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాముతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. దీనిని రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడటంతో పాటు శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాము గింజల్లో మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని నీటిలో వేసి మరిగించి కషాయంగా ప్రిపేర్ చేసుకొని తాగవచ్చు. లేదా వాము పొడిని నీటిలో కలిపి తాగినా మంచిదే అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాము వాటర్‌తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనలుంటాయో తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలకు ఉపశమనం..

*వాము నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

*గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

శ్వాసకోశ సమస్యలకు చెక్..

*తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యల్లో ఉపశమనం కలుగుతుంది.

*ఇది శ్వాస నాళాలను శుభ్రం చేస్తుంది.

బరువు తగ్గేలా సహాయం..

*వాము నీరు మెటబాలిజాన్ని పెంచుతుంది.

* కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తోంది..

*వాము నీరు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్టాల్ పెంచడంలో సహాయపడుతోంది.

*ఇది రక్తపోటును నియంత్రించడంలోనూ ఉపయోగపడుతోంది.

ఆర్థరైటిస్ రాదు..

*వాము నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి వాపుతో సంబంధం ఉన్న ఎలాస్టేజ్ ఎంజైమ్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా కీళ్ల నొప్పి, కీళ్ల వాతం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

జలుబు నుంచి ఉపశమనం..

జలుబు, దగ్గు వంటి సమస్యలకు వాము నీరు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. వాములోని సమ్మేళనాలు దగ్గును తగ్గించి, శ్వాస సమస్యలను దూరం చేస్తాయి. తద్వారా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కల్పిస్తాయి.

శరీరంలో వేడిని పెంచుతుంది..

వాము శరీరంలోని వేడిని పెంచుతుంది. కావున వేడి శరీరం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచింది.

చర్మ సమస్యలు దూరం..

*వాము నీటిని శరీర డిటాక్స్ కోసం ఉపయోగిస్తారు.

*మొటిమలు వంటి సమస్యలకు లోపల నుంచి పరిష్కారం కలుగుతుంది.

పీరియడ్స్‌లో పెయిన్స్‌ దూరం..

మహిళలకు పీరియడ్స్‌ సమయంలో అసౌకర్యాన్ని వాము వాటర్ తగ్గించగలదు. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రెగ్యులర్ పీరియడ్స్ సైకిల్‌ను సజావుగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి లేని, నొప్పి లేని పీరియడ్ అనుభవాన్ని అందిస్తుంది.

దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ వాము గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడగట్టి.. ఖాళీ కడుపుతో తాగాలి. అవసరమైతే ఇందులో తేనె కలిపి కూడా తాగొచ్చు.

నోట్: ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించింది మాత్రమే. చిన్నపిల్లలకు, గర్భవతులకు లేదా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వాడకానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Next Story