- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదయాన్నే తులసి ఆకులు తింటున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!?
మీరు ఉదయాన్నే తులసి ఆకులు తింటున్నట్లయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.

దిశ,వెబ్‌డెస్క్: ‘తులసి’ ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. నిజానికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం ‘తులసి’. మన దేశంలో చాలా మంది తులసి మొక్కను దైవంగా భావించి పూజిస్తారు. పురాణాల్లో ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజలందుకుంటున్న తులసి.. ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. ప్రస్తుత వర్షాకాలంలో చాలా వరకు జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలు వెంటాడుతాయి. ఈ సమస్యల నుంచి తులసి ఆకులు ఉపశమనం కలిగిస్తుంది. ఉదయాన్నే నాలుగు తులసి ఆకులు తింటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచించారు.
తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తులసి ఆకులను తేనెతో కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదు.. బరువు తగ్గాలనే అనుకునేవారు తులసి నీటిని తాగడం ద్వారా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సాధారణ జ్వరం వచ్చినప్పుడు తులసి ఆకులతో ప్రిపేర్ చేసిన కషాయం తాగితే తగ్గుతుంది. ఇక, టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న వారు తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతిపూటా తాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుంది. కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసి ఆకులు తింటే కడుపులోని క్రిములు సైతం తొలగిపోతాయి. అలాగే, ఉదయాన్నే నాలుగు తులసి ఆకులు, రెండు మిరియాలు వేసి మెత్తగా మిక్స్ చేసి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందు వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది.
నోట్: పైన తెలిపిన సమాచారం నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వైద్యులను సంప్రదించడం మంచిది.
Also Read..
Brazil nuts : రోజుకు మూడు చొప్పున ఈ గింజలు తింటే చాలు.. శరీరంలోని ఆ సమస్యలన్నీ పరార్..!






