- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిగడుపున నీళ్లు తాగడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?
ఆరోగ్యకరమైన జీవితం కోసం శరీరానికి తగిన మోతాదులో నీరు తీసుకోవడం అవసరమని చెప్తుంటారు నిపుణులు. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. కాగా ముఖ్యంగా పరిగడపునే నీరు తాగడం అనేది

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యకరమైన జీవితం కోసం శరీరానికి తగిన మోతాదులో నీరు తీసుకోవడం అవసరమని చెప్తుంటారు నిపుణులు. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. కాగా ముఖ్యంగా పరిగడపునే నీరు తాగడం అనేది మరింత ఆరోగ్యకరమైన అలవాటు అని వివరిస్తున్నారు. ప్రాచీన ఆయుర్వేద చరిత్ర, ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఇదే చెప్తుండగా.. ఇందుకు సంబంధించిన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. బాడీ డీటాక్స్ : నిజానికి రాత్రి విశ్రాంతిలో ఉన్న బాడీ డిటాక్సిఫికేషన్‌కు సమయాన్ని వెచ్చిస్తుంది. అలాంటప్పుడు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచిది. దీనివల్ల సహజంగా వ్యర్థాలు బయటకుపోతాయి.
2. జీర్ణశక్తి మెరుగుదల: ఉదయాన్నే నీరు తాగడం జీర్ణశయానికి మేలు చేస్తుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. మెటబాలిక్ యాక్టివిటీ పెరిగి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
3. ఆరోగ్యమైన చర్మం : బాడీ డీహైడ్రేట్ అయితే అనారోగ్య సమస్యలు వెంటనే ఉంటాయి. ముఖ్యంగా చర్మం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. అదే హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు తగిన మొత్తంలో వాటర్ తీసుకుంటే చర్మం ఆరోగ్యకరంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మొటిమలు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
4. బ్రెయిన్ యాక్టివిటీ: మెదడు 70% నీటితో తయారవుతుంది. ఉదయం తగినంత నీటిని తీసుకుంటే అవగాహన, మానసిక స్పష్టత మెరుగుపడుతుంది. బ్రెయిన్ బాగా పనిచేయడంతో పనిపై ఫోకస్ పెరుగుతుంది.
5. హార్మోనల్ బ్యాలెన్స్: శరీరంలో రసాయనాల సమతుల్యత కొంతవరకు నీటి ఆధారంగా ఉంటుంది. ఇది హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. అంతేకాదు
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మూత్రపిండాలకు సహాయపడుతుంది. మూత్ర నాళాల్లోని వ్యర్థ పదార్థాలు తొలగుతాయి.
ఎన్ని నీళ్లు తాగాలి?
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో 500ml నుంచి 1 లీటరు వరకు గోరు వెచ్చటి నీరు తాగడం మంచిది.ఆ తర్వాత కనీసం 30 నిమిషాలు ఆహారం తీసుకోకుండా ఉండాలి. అయితే చాలా చల్లటి నీరు తాగకూడదు. ఎందుకంటే బాడీకి ఎక్స్‌ట్రీమ్ హీట్, ఎక్స్‌ట్రీమ్ కూల్ మంచిది కాదు. అంతేకాదు ఒకేసారి ఎక్కువ నీరు కూడా తీసుకోకూడదు. మెల్లమెల్లగా తాగాలి.






