హ్యాంగోవర్ తో తలపట్టేసిందా? ఈ టిప్స్ ట్రై చేసి చూడు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-01 04:31:37  IST  )

కొత్త సంవత్సరానికి తమకు నచ్చినట్లుగా ఆహ్వానం పలికారు. చాలామంది హ్యాంగోవర్ తో వెల్కమ్ చెప్పారనడంలో అతిశయోక్తి లేదు.

హ్యాంగోవర్ తో తలపట్టేసిందా? ఈ టిప్స్ ట్రై చేసి చూడు
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరం మొదలైంది. అందరూ తమకు నచ్చినట్లుగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. కానీ చాలామంది హ్యాపీగా వెల్కమ్ చెప్పారనే కంటే హ్యాంగోవర్ తో వెల్కమ్ చెప్పారనడం కరెక్టుగా ఉంటుంది. డిసెంబర్ 31 రాత్రి మొదలుపెట్టి అర్థరాత్రి దాటేంతవరకూ తాగి.. తెల్లవారాక ఆ హ్యాంగోవర్ కు తలపట్టేసి.. దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక నానా తంటాలు పడుతుంటారు. కొత్త సంవత్సరం, తొలిరోజునే ఇలా హ్యాంగోవర్ తో ఉంటే ఎలా బ్రదర్. పక్కనోడు మంచి చేస్తే ఆదర్శంగా తీసుకోం గానీ.. వాడు తాగాడు,నేను కూడా తాగాలి అని వెంటనే ఫాలో అయిపోతావ్ కదా. ఇప్పుడు ఎంత చెప్పినా గడిచిన రాత్రి తిరిగిరాదు కదా. తలకెక్కిన హ్యాంగోవర్ ను ఎలా వదిలించుకోవచ్చో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

ఇవన్నీ హ్యాంగోవర్ లక్షణాలే..

తలనొప్పి, తల తిరగడం, నోరు ఎండిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు వచ్చినట్లు ఉండటం.. ఇవన్నీ హ్యాంగోవర్ లక్షణాలే. దీనివల్ల డే అంతా చాలా చిరాకుగా ఉంటుంది. ఆ హ్యాంగోవర్ ను కొన్ని టిప్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఆల్కహాల్ తీసుకున్నాక శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది. సో ఉదయం లేవగానే నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చని నీటిని కొద్దికొద్దిగా తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్ తగ్గి, తలనొప్పి వంటి సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుంది.

కొబ్బరినీళ్లు, కాఫీతో రిలీఫ్

కొబ్బరి నీళ్లు తాగితే ఇంకా మంచిది. వీటిలో ఉండే నాచరల్ ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని త్వరగా ఉత్తేజపరుస్తాయి. కాఫీలో ఉండే కెఫీన్ కూడా మత్తును తగ్గించడంలో యూజ్ అవుతుంది. బట్ ఒక కప్పు కంటే ఎక్కువ కాఫీ తీసుకుంటే డీహైడ్రేషన్ పెరిగే ఛాన్సుంది.

హ్యాంగోవర్ కు నేచురల్ మెడిసిన్ నిమ్మ

హ్యాంగోవర్ తగ్గడానికి అందరూ ముందుగా చేసేపని నిమ్మరసం తాగడం. ఇందులో ఉండే విటమిన్ సి ఆల్కహాల్ ప్రభావాన్ని సహాయ పడుతుంది. మజ్జిగలో నిమ్మరసం పిండుకుని తాగినా హ్యాంగోవర్ నుంచి కాస్త రిలీఫ్ పొందొచ్చు.

వామిట్ సెన్సేషన్ ను తగ్గించే అల్లం

వికారం, వామిట్ సెన్సేషన్ ను తగ్గించే శక్తి అల్లంకు ఉంది. కొన్ని అల్లం ముక్కల్ని నీటిలో వేసి మరిగించి.. ఆ నీటిని గోరువెచ్చగా తాగాలి. ఎనర్జీ కోసం అరటిపండును తినడం లేదా అరటిపండుతో షేక్ చేసుకుని తాగడం చేయాలి. యాపిల్, అవకాడో వంటి పండ్లు కూడా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.

Next Story