మండుతున్న ఎండలు.. వేసవి తాపం నుంచి రక్షణ పొందాలంటే ఇవి తాగాల్సిందే!

by Yella Dhawani Reddy |

వేసవి పూర్తిగా ప్రారంభం కాక ముందే ఎండలు మండుతున్నాయి.

మండుతున్న ఎండలు.. వేసవి తాపం నుంచి రక్షణ పొందాలంటే ఇవి తాగాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి పూర్తిగా ప్రారంభం కాక ముందే ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగకు ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళల్లో అయితే బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సరైన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఈ నేపథ్యంలో వేసవి తాపం నుంచి రక్షించే హెల్తీ డ్రింక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

* షర్బత్‌: వేసవిలో శరీరాన్ని త్వరగా చల్లబరచడంలో షర్బత్ చాలా సహాయపడుతుంది. ఇక పూలు, పండ్లు, మూలికలతో రకాల షర్బత్‌లు తయారు చేసుకోవచ్చు. సమ్మర్‌లో షర్బత్‌లను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

* మజ్జిగ: సమ్మర్‌లో మజ్జిగ తాగటం ఎంతో మంచింది. అందులోనూ వెన్న తీసిన మజ్జిగ మరింత శ్రేష్ఠం. మజ్జిగలో నీరు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరానికి తగినంత నీరు అందించడానికి సహాయపడతాయి. జీర్ణాశయ సమస్యలకు మంచి పరిష్కారం. దీంట్లోని ప్రొబయాటిక్స్‌ చలువ చేస్తాయి.

* కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీరు తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది వేసవిలో అలసటను నివారించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరం దానిలోని పోషకాలను సులభంగా గ్రహిస్తుంది.

* పండ్ల రసాలు: వేసవిలో శరీరాన్ని చల్లబడడానికి, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పండ్ల రసాలు రెగ్యూలర్‌గా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, నారింజ, నిమ్మ, మామిడి, దోసకాయ, టమోటా వంటి పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

* జల్‌జీరా: ఇది ఉత్తర భారతీయ సంప్రదాయ పానీయం. జీలకర్ర, నల్లమిరియాలు, పుదీనా, నల్ల ఉప్పులతో తయారు చేస్తారు. శరీరానికి చలవ చేసే ఈ పానీయాన్ని ఇప్పుడు చాలా ప్రాంతాల్లో తీసుకుంటున్నారు.

* చిరుధాన్య పానీయం: సజ్జలు, జొన్న పిండి, వాము, సోంఠిపొడి, ఉప్పు కలిపి చేసే పానీయం రాజస్థానీయులకు ఎంతో ఇష్టం. ఇవన్నీ కలిపి బాగా మరిగించి మజ్జిగలో కలిపి తీసుకుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, రాగి జావ, జొన్న ఘట్కా వంటివి కూడా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Next Story