- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heat stroke: ఎండలు మండుతున్నాయ్.. ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లే!
సమ్మర్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రారంభమైన భానుడి భగ భగలు..

దిశ, వెబ్ డెస్క్: సమ్మర్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రారంభమైన భానుడి భగ భగలు.. ప్రస్తుతం తీవ్రరూపం దాల్చాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండుతుండటంతో ప్రజలు అడుగు తీసి బయటపెట్టాలంటే జంకుతున్నారు. మార్చి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందో అని జనం బెంబేలేత్తిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందని, తప్పనిసరిగా సరైనా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వడదెబ్బ తగిలినప్పుడు శరీరంలో వచ్చే మార్పులేంటి? వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
వడదెబ్బ తగిలితే కనిపించే లక్షణాలు:
వడదెబ్బ తగిలిన వారి శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. శరీరం వేడి తగ్గించుకోవడం కోసం వేగంగా శ్వాస తీసుకుంటారు. అలాగే, గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. ఎండ ప్రభావంతో కళ్లు తిరగటం, కాళ్ల వాపులు, శరీర కండరాలు పట్టుకోవటం, అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి సత్వర వైద్యం అందించాలి.
వడదెబ్బ తగిలిన వారికి ప్రాథమిక చికిత్స:
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. చల్లని గాలి తగిలేలా ఉంచాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి బొండం లేదా చిటికెడు ఉప్పు, చక్కెర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ORS వంటివి తాగించాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి.
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* వేసవిలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. దాన్ని నివారించేందుకు రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. భోజనం మితంగా చేయాలి.
* మండే ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, తాజా ఉండే రసాలు తీసుకోవాలి.
* అలాగే, రెగ్యూలర్‌గా పుచ్చకాయ, దోసకాయ, చెరకు రసం, ద్రాక్ష, మామిడి పండ్ల జ్యూస్‌లను తాగాలి.
* అధిక ఉష్ణోగ్రతలలో వ్యాయామం చేయకూడదు.
* చల్లటి నీటితో స్నానం చేయాలి.
* లేత రంగు, వదులుగా, సౌకర్యవంతమైన దుస్తువులు ధరించాలి.
* ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించాలి.
* రోడ్లపై అమ్మే కలుషిత ఆహారం తినవద్దు. ఇంట్లో వండుకున్నవి మాత్రమే తినాలి.
* నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి.
* ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తుంది.
గమనిక: ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే మందుకు వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే.. ఈ విషయాన్ని వాస్తవాలు, నిపుణల అభిప్రాయాలు మాత్రమే. వీటిని దిశ ధృవీకరించలేదు.
Read More : రోజులో నీళ్లను ఏ సమయంలో తాగాలంటే..






