తస్మాత్ జాగ్రత్త.. మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా!

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-12 11:45:06  IST  )

మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

తస్మాత్ జాగ్రత్త.. మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం తగ్గిపోయింది. ఈ బిజీ ప్రపంచంలో చాలా మంది ఇంట్లో వంట చేసుకోవడానికి సమయం ఉండకపోవడంతో బయట ఫుడ్ తింటూ ఉంటారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే.. చాలా మంది శరీర ఆరోగ్యానికి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్ ఒకటి.

ఈ సమస్య మరెన్నో అనారోగ్యాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ గుర్తించడం అంత తొందరగా సాధ్యం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని గుర్తించే లోగా గుండె సమస్యలతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. కానీ.. కొన్ని చిన్న చిన్న సిగ్నల్స్ ద్వారా మనం అధిక కొలెస్ట్రాల్ సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆ వ్యక్తులకు కొన్ని మార్పులు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మతి మరుపు వస్తుంది. చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోతుంటారు. మెదడు పనితీరు పై కూడా ప్రభావం చూపుతోంది. అలాగే, కాళ్లలో తిమ్మిరి గా ఉంటుంది. నడుస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్లు చల్లగా అనిపించడం. లేదా ఆకస్మాత్తుగా కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం అధిక కొలెస్ట్రాల్ ప్రభావమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా రక్త ప్రసరణ సరిగా లేకపోతే కూడా చేతులు, కాళ్ళు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా ఉండకపోవడం కామన్. బాగా నిద్ర పోయినా కూడా రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తే.. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. యంగ్ ఏజ్‌లో ఉన్న కూడా కొందరికి కళ్ళ కింద తెల్లని వలయాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్ సంకేతమని చెబుతున్నారు. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించడం మంచిది.

నోట్:ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి.

Next Story