- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐతో ఆత్మహత్య చర్చలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మనిషి జీవితంలో భాగంగా మారింది. ప్రతీ చిన్న విషయానికి సజెషన్స్ అడగడం అలవాటు అయిపోయింది. ఇంట్లో వాషింగ్ మెషిన్ ఎందుకు పని చేయడం లేదనే ప్రశ్న నుంచి గుడ్ పేరెంటింగ్ అంటే ఏంటి వరకు

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మనిషి జీవితంలో భాగంగా మారింది. ప్రతీ చిన్న విషయానికి సజెషన్స్ అడగడం అలవాటు అయిపోయింది. ఇంట్లో వాషింగ్ మెషిన్ ఎందుకు పని చేయడం లేదనే ప్రశ్న నుంచి గుడ్ పేరెంటింగ్ అంటే ఏంటి వరకు.. దాదాపు చాలా మంది ఏఐ సూచనలు అడుగుతున్నారు. అంతేకాదు విద్య, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోనూ ఏఐ గొప్ప మార్పలు తీసుకురాగలిగింది. అయితే చాట్ జీపీటీని డెవలప్ చేసిన OpenAI.. అంతర్గత డేటా విశ్లేషణ ఆధారంగా ఓ భయానక వాస్తవాన్ని బయటపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానసిక ఆరోగ్య సంక్షోభానికి మధ్య సంబంధాన్ని గురించి సంచలన విషయాలు చెప్పింది. ముఖ్యంగా చాట్ జీపీటీలో ఆత్మహత్యల గురించి చర్చలు జరుగుతున్నాయని.. ప్రతి వారం ఏకంగా 80 కోట్ల మంది వినియోగదారులు ఇదే విషయాన్ని డిస్కస్ చేస్తున్నారని చెప్పింది. సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు? ఎలా చేసుకుంటున్నారు? అనే విషయాన్ని స్పష్టంగా ఏఐకి మెసేజ్ చేస్తూ..చర్చిస్తున్నారు.
అంటే ప్రతిరోజూ లక్షలాది మంది వినియోగదారులు మానసిక ఆరోగ్య సంక్షోభంపై చర్చిస్తున్నారు. ఆరు లక్షల మందికిపైగా జనాలు సైకోసిస్ వంటి లక్షణాలను చూపుతుండగా.. కోటికి మంది పైగా జనాలు ఏఐపైనే మానసికంగా అధికంగా ఆధారపడుతున్నారు. పరోక్షంగా ఇది వాస్తవిక సంబంధాలను ప్రమాదంలో పడేస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్యూయల్ రోల్‌ను సూచిస్తుంది. ఒకటి సహాయకారుడిగా హెల్ప్ చేయడం.. మరొకటి పరోక్షంగా రిస్క్‌గా మారడం.
అసలు ఏఐని ఎందుకు ఎంచుకుంటున్నారు?
* ఈ ట్రెండ్‌కు కారణం సమాజంలోని లోతైన సమస్యలు. చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నమ్మకమైన స్నేహితుడిగా భావిస్తున్నారు.
* కొవిడ్ తర్వాత సోషల్ మీడియా, టెక్నాలజీ వాడకం పెరిగింది. దీని వల్ల ఒంటరితనం పెరిగింది. లైఫ్‌లో సపోర్ట్ తగ్గింది. దీంతో 24 గంటలు అందుబాటులో ఉండే ఏఐ ఫ్రెండ్ అయిపోయింది.
* అంతేకాదు తోటి మనుషులు, ఫ్రెండ్స్‌తో మానసిక ఆరోగ్యం గురించి చర్చిస్తే.. తప్పుగా అర్థం చేసుకుంటారని, తక్కువగా చూస్తారని భయపడుతారు. అదే సమయంలో ఏఐ ఎలాంటి జడ్జ్‌మెంట్ చేయకుండా అడిగిన విషయానికి స్పందిస్తుంది. మానసికంగా ఉపశమనాన్ని ఇస్తుంది.
* దీంతో యూత్ ఏఐని పర్ఫెక్ట్ లిజనర్‌గా చూస్తున్నారు. ఎమోషనల్‌గా దీనిపైనే ఆధారపడుతున్నారు.
ఏఐ ఎమోషనల్ టూల్
* 60 దేశాలకు చెందిన 170 మందికిపైగా మానసిక ఆరోగ్య నిపుణులతో కలిసి జీపీటీ - 5ను అప్ డేట్ చేయబడింది. సూసైడ్, సెల్ఫ్ హార్మ్ సూచనలను 65% ఎక్కువ ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. సంభాషణలకు సరిగ్గా మార్గనిర్దేశం చేస్తుంది. ప్రమాదం లేకుండా చూస్తుంది. బ్రేక్స్ తీసుకోవాలని, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని సూచిస్తుంది. మానసిక సమస్యలపై అవగాహన పెంచుతుంది. సహాయం కోరడానికి ఒక డోర్‌వేగా పనిచేస్తుంది. కానీ AI తప్పుడు సలహాలు ఇస్తే మాత్రం సమస్య మరింత తీవ్రతరం కావచ్చు.






