నోటితో శ్వాస తీసుకుంటున్నారా? ఈ తీవ్ర పరిణామాలు తప్పవు..

by Sujitha Rachapalli |

ఈ మధ్య నోటితో శ్వాస తీసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది అంటున్నారు నిపుణులు. పడుకునేటప్పుడు.. నడిచేటప్పుడు.. బాత్రూమ్ యూజ్ చేసేటప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో మౌత్ బ్రీథింగ్ కామన్

నోటితో శ్వాస తీసుకుంటున్నారా? ఈ తీవ్ర పరిణామాలు తప్పవు..
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య నోటితో శ్వాస తీసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది అంటున్నారు నిపుణులు. పడుకునేటప్పుడు.. నడిచేటప్పుడు.. బాత్రూమ్ యూజ్ చేసేటప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో మౌత్ బ్రీథింగ్ కామన్ అయింది. అయితే దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయని చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

* ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు

నోటిలో శిలీంద్రాలు లేకపోవడం వల్ల బాక్టీరియా అంతర్గతంగా వెళ్లి శ్వాసకోశ సమస్యలు కలిగించవచ్చు. లంగ్స్ ఇన్‌ఫెక్ట్ కావొచ్చు. పొడినోరు ఏర్పడొచ్చు.

* దంత సంబంధ సమస్యలు

నోరు పొడిగా ఉండటం వలన దంతాల చుట్టూ పూత ఏర్పడి.. దంత క్షయం, దంత మాంసం (గింజివా) వ్యాధులు వస్తాయి.

* ముఖాకృతి మారడం

చిన్నపిల్లల్లో మౌత్ బ్రీథింగ్ ఎక్కువైతే వారి దంతాలు తేడాగా పెరుగుతాయి. ముఖాకృతిని ప్రభావితం చేస్తుంది. వంకరగా కనిపించవచ్చు.

* నిద్రలేమి, అలసట

మౌత్ బ్రీథింగ్ వలన నిద్ర సమయంలో సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల పూర్తిగా విశ్రాంతి కలగదు. దీని వల్ల రోజంతా అలసటగా ఉంటుంది.

* మాట్లాడటంలో సమస్య

మౌత్ బ్రీథింగ్‌తో నోటి, నాలుక స్థానంలో మార్పులు రావడం వల్ల స్పష్టంగా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

Next Story