- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Period Blood : పీరియడ్ బ్లడ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్
సోషల్ మీడియాలో ఏ విషయం ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో అర్థం కాదు. ప్రెజెంట్ పీరియడ్ బ్లడ్ ట్రెండ్ నడుస్తోంది. రుతుస్రావం రక్తాన్ని ఫేస్ మాస్క్‌గా వాడటం గురించి సోషల్ మీడియాలో

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఏ విషయం ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో అర్థం కాదు. ప్రెజెంట్ పీరియడ్ బ్లడ్ ట్రెండ్ నడుస్తోంది. రుతుస్రావం రక్తాన్ని ఫేస్ మాస్క్‌గా వాడటం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఉండే స్టెమ్ సెల్స్, ప్రోటీన్స్ కారణంగా చాలా లాభాలున్నాయని.. ఫేస్‌పై మచ్చలు తగ్గడంతోపాటు గ్లో వస్తుందని చెప్తున్నారు. కానీ ఇది ఎంత వరకు నిజం? నిజంగా లాభాలున్నాయా? తెలుసుకుందాం.
ఏది నిజం? ఏది అబద్ధం?
పీరియడ్ బ్లడ్ మాస్క్ కారణంగా శాస్త్రీయంగా నిరూపితమైన ఒక్క లాభం కూడా లేదని సూచిస్తున్నారు నిపుణులు. ఈ ట్రెండ్ ఫాలో అయితే అనవసర ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మెన్‌స్ట్రువల్ బ్లడ్‌లో స్టెమ్ సెల్స్ ఉండటం నిజమే కానీ వాటి సంఖ్య చాలా తక్కువ. పైగా చర్మం వీటని అబ్జర్వ్ చేసుకోదు. ఇందులో ఉండే ప్రోటీన, ఐరన్, హెమోగ్లోబిన్ కారణంగా గ్లో వస్తుందని కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు. కానీ ఇవి బయటి నుంచి చర్మంలోకి శోషించబడవనేది గుర్తుంచుకోవాలి.
ఒకవేళ ఫాలో అయితే రిస్క్ చాలా ఎక్కువే. మెన్‌స్ట్రువల్ బ్లడ్‌లో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు ఉండే అవకాశం ఎక్కువ. దీన్ని ముఖం మీద రాస్తే మొటిమలతో పాటు అనేక చర్మ వ్యాధులు వెంటాడే అవకాశం ఉంది. అరుదైన పరిస్థితుల్లో సెప్సిస్ వచ్చే చాన్స్ కూడా ఉంది. కొందరిలో రక్తంలోని ప్రోటీన్స్‌కు ఎలర్జీ రావొచ్చు. ఇక మీకు తెలియకుండా హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ/సీ ఉంటే.. చేతులు, ముఖంపై చిన్న స్క్రాచ్ ద్వారా ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి పీరియడ్ బ్లడ్ మాస్క్ ట్రెండ్‌ను డేంజరస్‌గా చెప్తున్న డెటర్మటాలజిస్టులు.. దీనివల్ల 100 శాతం నష్టమే అని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా చర్మాన్ని పాడు చేసుకోవద్దని సూచిస్తున్నారు.






