- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్నింగ్ ఇంటిమెసితో కపుల్స్‌కు పాజిటివ్ ఎనర్జీ.. ఆ ఒక్కటి ఇస్తే చాలు!
కపుల్స్‌కు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడంలో మార్నింగ్ ఇంటిమెసి కీ రోల్ పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

క్వాలిటీ టైమ్..
భాగస్వామితో గడిపే క్వాలిటీ టైమ్‌నే Morning ఇంటిమసీ అంటారు. ఇది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు.. సంభాషణలు లేదా సున్నితమైన స్పర్శ రూపంలోనూ ఉంటుంది. నైట్ పడుకున్న తర్వాత మన బాడీ, మనస్సు రీఛార్జ్ అవుతాయి. కాబట్టి ఉదయాన్నే ఫోన్, టీవీల, కంప్యూటర్‌కు దూరంగా ఉంటూ 15 నుంచి 20 నిమిషాలు పార్ట్‌నర్‌తో ప్రేమగా మాట్లాడితే పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది. ఇది రోజంతా ఉల్లాసంగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ఇద్దరి మధ్య నమ్మకాన్ని బలపరచడంతోపాటు మనసులో ఒకరిపట్ల ఒకరికి భద్రత, ప్రశాంతతను కలిగిస్తుంది. కార్టిసాల్ స్థాయిలు తగ్గడంతో ఆఫీసు లేదా ఇంటి పనులవల్ల కలిగే ఆందోళనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. మార్నింగ్ రిలీజ్ అయ్యే Endorphins, Dopamine మూడ్‌ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల ఆ రోజంతా ఉత్సాహంగా, సానుకూలంగా పనులు చేసుకోగలుగుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
బెన్‌ఫిట్స్..
మన బాడీలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి సహజమైన పెయిన్ కిల్లర్స్‌లా పనిచేసి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో స్కిన్ కలర్ మెరుస్తుంది. ఇది Blood Pressureను కంట్రోల్ చేస్తుంది. పార్ట్‌నర్ సపోర్ట్ ఎల్లప్పుడూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. Metabolism వేగవంతం చేయడంతోపాటు ఒకరిపై ఒకరికి శ్రద్ధ పెరగడం వల్ల మనస్పర్థలు తగ్గే అవకాశం ఉంటుందని, ఒకరంగా చెప్పాలంటే ఇదొక వ్యాయామం లాంటిదేనని పేర్కొన్నారు. ఇందుకోసం ఉదయం లేవగానే 30 సెకన్ల పాటు ఒకరినొకరు ప్రేమగా హత్తుకోండి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి. కాఫీ లేదా మార్నింగ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి ఇవ్వండి.






