- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోటికి, డిప్రెషన్‌కు సంబంధం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
డిప్రెషన్‌కు నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. కానీ నోటిలోని బ్యాక్టీరియా కూడా ఇందుకు కారణమని వెల్లడించింది తాజా అధ్యయనం. న్యూయార్క్ యూనివర్సిటీ రోరీ మేయర్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పరిశోధకులచే

దిశ, ఫీచర్స్ : డిప్రెషన్‌కు నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. కానీ నోటిలోని బ్యాక్టీరియా కూడా ఇందుకు కారణమని వెల్లడించింది తాజా అధ్యయనం. న్యూయార్క్ యూనివర్సిటీ రోరీ మేయర్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పరిశోధకులచే నిర్వహించబడిన ఈ అధ్యయనం.. నోటిలోని బ్యాక్టీరియా వైవిధ్యం తక్కువగా ఉన్నవారిలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపింది.
నోటిలో 500 బిలియన్ నుంచి 1 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది. పేగుల తర్వాత శరీరంలో రెండవ అతిపెద్ద సూక్ష్మజీవుల సమూహం ఇదే. కాగా నోటిలో బ్యాక్టీరియా డిప్రెషన్‌కు కారణమవుతుందని.. శరీరంలో వాపు (inflammation), రోగనిరోధక వ్యవస్థలో మార్పుల ద్వారా ఏర్పడవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. అమెరికాలోని 15,000 మంది గురించి 2009-2012 మధ్య సేకరించిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES) డేటాను విశ్లేషించిన పరిశోధకులు.. డిప్రెషన్ లక్షణాలను అంచనా వేయడానికి ప్రశ్నాపత్రాలను ఉపయోగించారు. వారి లాలాజల నమూనాలను జన్యు సీక్వెన్సింగ్ ద్వారా విశ్లేషించి నోటి మైక్రోబయోమ్ వైవిధ్యాన్ని కొలిచారు.
ప్రభావితం చేసే అంశాలు?
ధూమపానం, మద్యపానం, దంత సంరక్షణ వంటి అంశాలు నోటిలో బ్యాక్టీరియా సమతుల్యతను మార్చగలవు. యాంటీడిప్రెసెంట్ మందులు కూడా లాలాజల ఉత్పత్తిని తగ్గించి, నోటి వాతావరణాన్ని మార్చవచ్చు. ఇది మైక్రోబయోమ్‌పై ప్రభావం చూపుతుంది. అయితే నోటి మైక్రోబయోమ్ డిప్రెషన్‌ను ప్రభావితం చేస్తుందా, లేక డిప్రెషన్ వల్ల నోటి మైక్రోబయోమ్‌లో మార్పులు వస్తాయా, లేక ఈ రెండూ పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ డిప్రెషన్ ఉన్నవారు ఆహారపు అలవాట్లు, నోటి పరిశుభ్రతలో నిర్లక్ష్యం, ధూమపానం లేదా మద్యపానం, లేదా మందుల వాడకం వంటి అంశాల వల్ల నోటి మైక్రోబయోమ్‌లో మార్పులు రావచ్చు.






