- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలకు మ్యూజిక్ నేర్పించండి.. జీవితకాలం ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి..
డిజిటల్ యుగంలో పిల్లల లర్నింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. అందుకే కోడింగ్ లాంటివి నేర్పించేందుకు ఇంట్రెస్ట్ చేపిస్తున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే

దిశ, ఫీచర్స్ : డిజిటల్ యుగంలో పిల్లల లర్నింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. అందుకే కోడింగ్ లాంటివి నేర్పించేందుకు ఇంట్రెస్ట్ చేపిస్తున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే సక్సెస్ అవుతారనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. కానీ కోడింగ్ కన్నా మ్యూజిక్ నేర్పిస్తే బెటర్ అని సూచిస్తుంది ఎంఐటీ పరిశోధన. యంగ్ ఏజ్‌లోనే మ్యూజిక్ ఇంట్రడ్యూజ్ చేయడం వల్ల ఆలోచనా సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయని వివరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
సంగీత శిక్షణ... మెదడు అభివృద్ధి
* హార్వర్డ్, నార్త్‌వెస్టర్న్, యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వంటి సంస్థల నుంచి వచ్చిన అనేక అధ్యయనాలు సంగీతం పిల్లల మెదడు అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించాయి. చిన్న వయస్సు నుంచి (7-9 సంవత్సరాల ముందు) సంగీత వాయిద్యం నేర్చుకోవడం మెదడులో వైట్ మ్యాటర్ కనెక్టివిటీని పెంచుతుంది. ముఖ్యంగా కార్పస్ కాలోసమ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇది మెదడు యొక్క రెండు హెమిస్ఫియర్‌లను కలుపుతుంది. మాట, జ్ఞాపకశక్తి, ఫోకస్ వంటి విధులకు మద్దతు ఇస్తుంది.
* అంతేకాదు సంగీత శిక్షణ హియరింగ్ ప్రాసెసింగ్, మాట్లాడే తీరు, నాలెడ్జ్, కార్యనిర్వాహక విధులు (ఉదా., ప్లానింగ్, కంట్రోలింగ్, కాగ్నిటివ్ సోర్స్ ) కోసం న్యూరల్ నెట్‌వర్క్‌లను బలపరుస్తుంది. ఇవి భాషా అభివృద్ధి, సాధారణ బుద్ధిశక్తికి కీలకమైన ప్రాంతాలతో ఓవర్‌లాప్ అవుతాయి. పిల్లలు తర్వాత సంగీతం నేర్చుకోవడం ఆపినా.. నిర్మాణాత్మక, క్రియాత్మక మెదడు మార్పులు కొనసాగుతాయి. కాబట్టి తొమ్మిది సంవత్సరాల ముందు సంగీత శిక్షణ ప్రారంభించడం ఈ ప్రయోజనాలను గరిష్టంగా చేస్తుంది. భావోద్వేగ నియంత్రణ, సానుభూతి, సామాజిక నైపుణ్యాలను పెంపొందిస్తుంది.
కోడింగ్.. బ్రెయిన్ వర్కింగ్..
MIT మెక్‌గోవర్న్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనం కోడింగ్ న్యూరల్ ప్రభావాలను పరిశీలించింది. కోడింగ్ ప్రధానంగా మల్టిపుల్ డిమాండ్ (MD) నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఆలోచన, సమస్య పరిష్కారం, కార్యనిర్వాహక విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ నెట్‌వర్క్ మ్యాథ్స్, పజిల్స్, ప్లానింగ్ వంటి నాలెడ్జ్ డిమాండ్ ఉన్న టాస్క్‌లలో ఉపయోగించబడుతుంది. కానీ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్రాంతాలను యాక్టివేట్ చేయలేదు. పైగా దీర్ఘకాలిక ఎఫెక్ట్ ఉండదు.






