- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చికెన్ ప్రియులకు శుభవార్త.. మార్కెట్‌లోకి కేఎఫ్‌సీ చికెన్ ఫ్లేవర్ టూత్ పేస్ట్.. క్రిస్పీ, హాట్, జ్యూసీ..
24 గంటలు తాజా శ్వాస.. మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా.. డిష్యూం డిష్యూం తన పని కదా.. అంటూ చాలా ఓరల్ కంపెనీలు రిఫ్రెషింగ్ టూత్‌పేస్ట్ ఫ్లేవర్‌లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి.

దిశ, ఫీచర్స్ : 24 గంటలు తాజా శ్వాస.. మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా.. డిష్యూం డిష్యూం తన పని కదా.. అంటూ చాలా ఓరల్ కంపెనీలు రిఫ్రెషింగ్ టూత్‌పేస్ట్ ఫ్లేవర్‌లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. పండ్లు, మసాలా దినుసులు, బొగ్గు, పుదీనా లాంటి ఫ్లేవర్స్‌తో సరికొత్తగా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాయి. అయితే కేఎఫ్‌సీ మాత్రం మరింత యూనిక్‌గా ట్రై చేసింది. తన బ్రాండ్‌కు అనుగుణంగా ఫ్రైడ్-చికెన్-ఫ్లేవర్డ్ టూత్‌పేస్ట్ తీసుకురాబోతుంది. టూత్‌కేర్ బ్రాండ్ హాయ్‌స్మైల్‌తో కలిసి ఈ ప్రయోగం చేస్తోంది.
నిజానికి ఏప్రిల్ ఫూల్ జోక్‌గా స్టార్ట్ అయిన ఈ ఆలోచన నిజంగానే ప్రాక్టికల్‌గా వర్క్ అవుట్ అయింది. ఫన్నీగా అనుకున్న ప్రొడక్ట్‌ను ఎందుకు రియల్‌గా లాంచ్ చేయకూడదనుకోవడమే ఇందుకు కారణమైందని చెప్పారు హాయ్‌స్మైల్ కంపెనీ ప్రతినిధులు. కాగా ఫ్రైడ్ చికెన్ టూత్‌పేస్ట్ 60 గ్రాముల ట్యూబ్‌లో రాగా దాదాపు పదకొండు వందల రూపాయల ధర పలుకుతోంది. ఫ్లోరైడ్ రహితమైన ఈ టూత్ పేస్ట్ సెన్సిటివ్ దంతాలు ఉన్నవారు కూడా వినియోగించవచ్చు. మొత్తానికి ఈ పేస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు KFC ఒరిజినల్ రెసిపీ చికెన్.. క్రిస్పీ, హాట్, జ్యూసి ముక్కను కొరికినట్లు అనిపిస్తుందని ప్రకటించింది కంపెనీ.
ఇక కేఎఫ్‌సీ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌తో కలిపి ఈ పేస్ట్ వాడితే అదిరిపోయే అనుభూతి లభిస్తుందని చెప్తున్న కంపెనీ.. ఈ బ్రష్ ధర రూ. 5027గా తెలిపింది. ఇంటర్నల్ ఆటోమేటిక్ టైమర్, మూడు క్లీనింగ్ మోడ్స్, మోడ్ మెమరీ సెట్టింగ్ కలిగిన ఈ బ్రష్.. కేఎఫ్‌సీ టూత్‌పేస్ట్ సరఫరా ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. కాగా హాయ్ స్మైల్ ఇంతకు ముందుకు కూడా ఇలాంటి ప్రత్యేక రుచులను తీసుకొచ్చింది. బ్లూ రాస్ బెర్రీ, గ్లేజ్డ్ డోనట్ వంటి తియ్యటి రుచులతోపాటు చిల్లీ మార్గరిటా వంటి స్పైసీ కిక్ కలిగిన టూత్ పేస్ట్‌లతో కస్టమర్ల అభిమానాన్ని చూరగొనడంలో సక్సెస్ అయింది.






