పిల్లల్లో షార్ప్‌నెస్ పెరగాలంటే ఇదొక్కటే మార్గం!

by Disha Web Desk 2 |
పిల్లల్లో షార్ప్‌నెస్ పెరగాలంటే ఇదొక్కటే మార్గం!
X

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న సమాజానికి అనుగుణంగా అందరూ బిజీ లైఫ్‌కు అలవాటు పడిపోయారు. కొందరు ఫోన్‌ వాడటానికి ఉపయోగించినంత సమయం కూడా ఇంట్లో వాళ్లకు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా నగరవాసులు బిజీ లైఫ్‌తో బంధాలకు దూరమవుతున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, దీని ప్రభావం ఇంట్లో పిల్లలపై పడుతోంది. దీంతో క్రమంగా పిల్లల్లో షార్ప్‌నెస్ తగ్గిపోవడం, బలవంతంగా చదువుకోవాలని ఒత్తిడి చేయడం, సరదా లైఫ్‌కు దూరం చేయడంతో చిన్నప్పటినుంచే పిల్లలు మానిసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బిజీ లైఫ్‌ గడిపే తల్లిదండ్రులకు నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. పిల్లలకు సమయం కేటాయించకపోతే ప్రమాదం పొంచివుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో చురుకుదనం పెరగాలంటే తల్లిదండ్రులే కీలక పాత్ర పోషించాలని పేర్కొంటున్నారు.

ఖాళీ సమయం దొరికినప్పుడు వీలైనంత వరకు పిల్లలతో గడపాలని చెబుతున్నారు. ముఖ్యంగా కథలు చెప్పడం, కొత్త వస్తువులు కొనివ్వడం, అప్పుడప్పుడు క్విజ్‌, పరీక్షలు వంటివి పెట్టి బహుమతులివ్వడం వంటికి చేస్తే వాళ్లలో ఉత్సాహం పెరగడంతో పాటు చురుకుదనం కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇంట్లో అలంకరణ వస్తువులుగా వాళ్ల చదువుకు ఉపయోగపడే బొమ్మలను ఉంచడం, ఫ్రేములుగా చేసి గోడలకు వేలాడదీస్తే కొత్త ఆలోచనలకు పదును పెట్టే ఆస్కారం ఉందని అంటున్నారు. తద్వారా సృజనాత్మక కూడా అలవడుతుంది. అంతేగాక, పిల్లలందరూ ఓ చోట చేరి ఆడుకునే సమయంలో చెదరగొట్టడం మంచిది కాదని, నలుగురిలో కలవడం, వస్తువులు పంచుకోవడం అలవాటవుతుందని, దీని ద్వారా మందచి వ్యక్తిక్తం పెంచుకోవడానికి అవకాశం ఉందని సూచనలు చేస్తున్నారు.


Next Story

Most Viewed