చలికాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? ఇవి తప్పక ట్రై చేయండి!

by Jakkula.Mamatha |

చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో చలి, పొడి గాలి, వైరస్‌లు వేగంగా వ్యాపిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చలికాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? ఇవి తప్పక ట్రై చేయండి!
X

దిశ,వెబ్‌డెస్క్: వాతావరణంలో మార్పులు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నట్లైతే సీజనల్ వ్యాధులు కూడా వేధిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో చలి, పొడి గాలి, వైరస్‌లు వేగంగా వ్యాపిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే సులభమైన మార్పులతో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు.

శీతాకాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే అతి త్వరగా జలుబు, దగ్గు, జ్వరం, వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఆరెంజ్, నిమ్మ వంటి విటమిన్ C కలిగిన ఫ్రూట్స్(మామిడి, జామ, కివి), ఒమెగా-3 కలిగిన చేపలు, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, బ్రొకోలీ, గ్రీన్ లీవ్స్, పాలకూర, పెరుగు, బాదం , సన్‌ఫ్లవర్ గింజలు, అల్లం, వెల్లుల్లి, గుడ్లు, పప్పులు, బీన్స్, పసుపు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వైద్య నిపుణులు సూచించారు.

అల్లం, వెల్లుల్లి, పసుపు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి ఇమ్యూనిటీ పెంచుతాయి. చలికాలంలో చల్లని వాటర్‌ను పూర్తిగా అవైడ్ చేయండి. గోరువెచ్చని నీరు ఎక్కువగా తాగండి. చలిలో నీరు తాగడం తగ్గిపోతుంది. గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు, డిటాక్స్‌కు ఉపయోగకరం. చాలా మందికి ‘టీ’ తాగడం అలవాటు ఉంటుంది. ఈ తరుణంలో నార్మల్ ‘టీ’ కి బదులుగా అల్లం టీ, గ్రీన్ టీ వంటివి తీసుకోండి. రోజూ రాత్రి నిద్రకు ముందు పసుపు పాలు తీసుకోవడం వల్ల శరీరాన్ని వేడిగా ఉంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.

అలాగే, రోజుకు 7-8 గంటలు నిద్ర పోవాలి. నిద్ర ఇమ్యూన్ సిస్టమ్‌ని రీసెట్ చేస్తుంది. చలిలో బయటకు వెళ్లడానికి ఇష్టం ఉండదు. దీంతో రోజూ వ్యాయామం చేసేవాళ్లు కూడా అలాగే పడుకుంటారు. కనుక తేలికపాటి వ్యాయామం, యోగా చేయడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచించారు. చలి కాలంలో వీచే ఈదురుగాలులు శరీరంలోని ఉష్ణోగ్రతను పూర్తిగా తగ్గిస్తోంది. ఇది ఇన్ఫెక్షన్స్‌కు అవకాశం ఇస్తుంది. కాబట్టి స్వెటర్, మఫ్లర్ వంటివి ధరించాలి. చాలా మందికి చలికాలంలో ఫ్లూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైద్యుడి సలహా మేరకు వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది.

నోట్: పైన తెలిపిన సమాచారం ఇంటర్నెట్ నుంచి స్వీకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ఏమైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు.

Next Story