- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fatty Liver: మీ శరీరంలో ఇలా జరుగుతుంటే మీ లివర్ పాడవుతున్నట్టే లెక్క!
Fatty Liver: నేటికాలంలో చాలా మంది ఫ్యాటీ లివర్(Fatty Liver) సమస్యతో బాధపడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: Fatty Liver: నేటికాలంలో చాలా మంది ఫ్యాటీ లివర్(Fatty Liver) సమస్యతో బాధపడుతున్నారు. అయినా కూడా చాలా మంది ఈ సమస్యను గుర్తించలేపోతున్నారు. ఫ్యాటీ లివర్(Fatty Liver) ను పరీక్షించడానికి అనేక పరీక్షలు ఉన్నప్పటికీ..హార్వర్డ్ వైద్య నిపుణుడు దీనిని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన సంకేతాలను తెలియజేశారు. మీకు ఫ్యాటీ లివర్ (Fatty Liver)ఉందేమో తెలుసుకోవాడానికి ఈ ఐదు లక్షణాలను గమనించాల్సి ఉంటుంది.
అధిక కొవ్వ పెరగడం ఫ్యాటీ లివర్(Fatty Liver) అనేది వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. అయితే దీన్ని గుర్తించడం చాలా క్లిష్టం. హార్వర్డ్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కడుపు దగ్గర అధికంగా కొవ్వు పెరగడం, ఫ్యాటీ లివర్(Fatty Liver) ముఖ్య లక్షణంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్(Fatty Liver) కు సంబంధించి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా కడుపు చుట్టూ కొవ్వు పెరుగుతుంది.
మీరు తరుచుగా అలసిపోతున్నా..అలసటతో బాధపడుతున్నా ఫ్యాటీ లివర్(Fatty Liver) సమస్య ఉండే అవకాశం ఉంది. కాలక్రమేణా ఈ సమస్య తీవ్రతరమవుతుంది. ముఖ్యంగా కాలేయంలో కొవ్వు నిల్వ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది.
అసౌకర్యం లేదా నొప్పి అనుభూతి ఉన్నట్లయితే, కుడి ముడిపెట్టు భాగంలో అసౌకర్యం లేదా నొప్పి ఉన్నట్లయితే అది ఫ్యాటీ లివర్ కు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాలేయం ప్రభావితమైతే కలిగే వాపు ఈ నొప్పిని కలిగిస్తుంది.
ఈ హెచ్చరికలు సంకేతాలు తొలుత చర్మంలో ఆకస్మిక మార్పులు గమనించినా జాగ్రత్తగా ఉండాలి. హార్వర్డ్ వైద్య నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం ఊహించని చర్మంపై ముడతలు, మొటిమలు రావడం, చర్మం నల్లబడటం, జుట్టు అధికంగా రాలిపోవడం ఇవన్నీ కూడా ఫ్యాటీ లివర్ లక్షణాలు కావచ్చు.
ఆహారం తినాలనే ఆసక్తి లేకపోవడం ..ఒంట్లో నిస్సత్తువగా అనిపిస్తే..ఫ్యాటీ లివర్ సమస్య ఉండే అవకాశం ఉంది. కాలేయ సమస్యల కారణంగా ఆహారం రుచి అనిపించకవపోడం లేదా చిరాకుగా అనిపించడం సాధారణంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పై లక్షణాల్లో మీకు ఏదైనా అనిపిస్తే మీ కాలేయం సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. సమస్యను మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.






