- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IVF సైకిల్ ఫెయిల్ అయిందా? ఏం చేయాలి?
IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సైకిల్ ఫెయిల్ అయితే దంపతులు తీవ్రమైన భావోద్వేగాలను ఎదుర్కుంటారు. ఆర్థిక ఒత్తిడి, భవిష్యత్ గురించి ఆలోచన, చుట్టుపక్కల వారి మాటలు తీవ్రంగా బాధపెడుతుంటాయి.

దిశ, ఫీచర్స్ : IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సైకిల్ ఫెయిల్ అయితే దంపతులు తీవ్రమైన భావోద్వేగాలను ఎదుర్కుంటారు. ఆర్థిక ఒత్తిడి, భవిష్యత్ గురించి ఆలోచన, చుట్టుపక్కల వారి మాటలు తీవ్రంగా బాధపెడుతుంటాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ నార్మల్ అవుతున్నందునా.. ఒకవేళ ఈ సైకిల్ ఫెయిల్ అయితే.. చికిత్స తర్వాత దంపతుల ఎమోషనల్ ఇంపార్టెన్స్ గురించి నొక్కి చెప్తున్నారు నిపుణులు. ఈ హీలింగ్ ప్రాసెస్.. ఐవీఎఫ్ ప్రాసెస్‌తో సమానంగా ముఖ్యమైనదని.. పూర్తి వైద్య పరీక్ష, ఆ సమయంలో భావోద్వేగ సహాయం, స్పష్టమైన ప్రణాళిక ఉండాలని సూచిస్తున్నారు.
1. ఏడ్వడం మంచిదే
ఫెయిల్డ్ IVF సైకిల్ తర్వాత దంపతులు దుఃఖం, గందరగోళం, నిరాశ, సిగ్గు పడటం వంటి అనేక భావాలను అనుభవించడం సహజం. ఇలాంటప్పుడు ఎమోషన్స్‌ను లోపలోనే దాచుకోకుండా.. ఏడవడమే మంచిదని సూచిస్తున్నారు. తద్వారా మనలోని ఎమోషన్స్ బయటకు వచ్చి మనసు ఎంతో కొంత స్థిరంగా ఉంటుందని అంటున్నారు. సాధ్యమైతే కొన్ని రోజులు పని నుంచి సెలవు తీసుకోవాలని.. ఎమోషనల్ సపోర్ట్ కోసం నమ్మకమైన కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడాలని చెప్తున్నారు. ఈ సమయంలో జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదని.. క్లినిక్ అందించే కౌన్సెలింగ్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే.. ఫెర్టిలిటీ సమస్యలలో స్పెషలైజ్డ్ మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించమని చెప్తున్నారు.
2. సైకిల్ డేటాపై రివ్యూ
భావోద్వేగాలను ప్రాసెస్ చేసిన తర్వాత.. ఫెర్టిలిటీ టీమ్‌తో ఫాలో-అప్ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయండి. ఎన్ని ఎగ్స్ వచ్చాయి? ఫెర్టిలైజేషన్ రేటు, ఎంబ్రియో డెవలప్మెంట్, నాణ్యత, PGT-A (ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్) చేశారా వంటి విషయాలను అడగండి. ల్యాబ్ ప్రోసీజ్స్, ఎంబ్రియో గ్రేడింగ్, అబ్‌నార్మాలిటీస్ గురించి స్పష్టమైన వివరణ కోరండి. ఏమైందో తెలుసుకోవడం భవిష్యత్ ప్రయత్నాల్లో మార్చగల అంశాలను గుర్తించడానికి.. మీలో ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది.
3. మెడికల్ రీజన్స్
సైకిల్ అనుకోని ఫలితాలను ఇచ్చినట్లయితే మరింత సెర్చ్ అవసరం కావచ్చు. పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, సైనెకియా (అడెషన్స్), క్రానిక్ ఎండోమెట్రిటిస్ వంటి గర్భాశయ కారణాలు ఇంప్లాంటేషన్‌ను ప్రభావితం చేస్తాయి. ఇలాంటప్పుడు హిస్టరోస్కోపీ లేదా సోనోహిస్టరోగ్రఫీ అవసరం కావచ్చు. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉంటే హార్మోనల్ డిజార్డర్స్, థైరాయిడ్, ఆటోఇమ్యూన్ పరిస్థితులు, రక్తం గడ్డకట్టడం సమస్యల గురించి పరీక్షలు చేయాల్సి ఉంటుది. పురుషుల్లో మోడ్రన స్పెర్మ్ టెస్టింగ్ (DNA ఫ్రాగ్‌మెంటేషన్).. రొటీన్ టెస్టుల్లో తెలియని సమస్యలను బయటపెట్టవచ్చు. మీ వైద్యుడితో చర్చించి.. ఈ పరీక్షలపై దృష్టి పెట్టండి.
4. సెకండ్ ఒపీనియన్
వైద్యులు ఇచ్చే వివరణలు, చికిత్సపై సందేహం ఉంటే మరొక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది. ల్యాబ్‌ల నాణ్యత, ప్రోటోకాల్స్, అనుభవం వేర్వేరుగా ఉంటాయి. రికార్డులను హై-వాల్యూమ్ సెంటర్‌కు బదిలీ చేయడం కొత్త ఆలోచనా విధానాన్ని ఇవ్వవచ్చు. క్లినిక్‌లతో మాట్లాడేటప్పుడు మీ ప్రొఫైల్‌కు సమానమైన రోగుల సక్సెస్ రేట్లను అడగండి.
5. చికిత్సా విధానాలను మార్చండి
రివ్యూ ఆధారంగా స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్, ట్రిగ్గర్ టైమింగ్, ల్యాబ్ టెక్నిక్స్ లేదా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ విధానాలను మార్చవచ్చు. ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ (FET) సాధారణ మార్పు. వయసు ఎక్కువ ఉన్నవారు లేదా క్రోమోజోమల్ సమస్యలు ఉన్నవారు డోనర్ ఎగ్స్‌ను పరిగణించవచ్చు. ఖర్చులు, సైడ్ ఎఫెక్ట్స్, రియలిస్టిక్ సక్సెస్ రేట్లను చర్చించండి. ఫైనాన్షియల్, లాజిస్టికల్ వాస్తవాలను అంచనా వేయండి. IVF అనేది భారీ ఆర్థిక నిర్ణయం. ఫెయిల్ అయితే బడ్జెట్‌ను మళ్లీ సర్దుబాటు చేయండి. ఫైనాన్సింగ్ ఆప్షన్లు, NGO గ్రాంట్లు, ఉద్యోగ ఆపర్చునిటీలను చూడండి. పదే పదే విఫలమైతే దత్తత, సరోగసీ, ఫాస్టరింగ్ లేదా చైల్డ్‌ఫ్రీ జీవితాన్ని ఎంచుకోండి.
6. తదుపరి అడుగు
ఫెయిల్డ్ IVF సైకిల్ ముగింపు కాదు.. కేవలం సెట్‌బ్యాక్ మాత్రమే. సరైన రివ్యూ, సవరణలు, భావోద్వేగ సహాయం, ప్రాగ్మాటిక్ ప్లానింగ్‌తో అనేక మంది విజయం సాధిస్తారు. ముఖ్యంగా తదుపరి నిర్ణయం ఆవేశంగా కాకుండా సమాచారం ఆధారంగా ఉండాలి.






