నెలకు ఒక్కసారి వస్తేనే భరించలేం.. అలాంటిది వెయ్యి రోజులుగా ఆగకుండా పిరియడ్స్.. వైద్యులు సైతం షాక్!

by Yella Dhawani Reddy |

మహిళలకు పిరియడ్స్ రావటం అనేది సర్వసాధారణం.

నెలకు ఒక్కసారి వస్తేనే భరించలేం.. అలాంటిది వెయ్యి రోజులుగా ఆగకుండా పిరియడ్స్.. వైద్యులు సైతం షాక్!
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలకు పిరియడ్స్ (Periods) రావటం అనేది సర్వసాధారణం. ఇక రుతుక్రమం (Menstruation) నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్‌ రెగ్యులర్‌‌గా పిరియడ్స్ వస్తుంటుంది. ఇక నెలసరి సమయంలో ఆ మూడు నుంచి వారం రోజుల పాటు మహిళలు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటిది ప్రతి రోజు పిరియడ్స్ వస్తే ఈ భాధను వర్ణించలేం. ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా.. కానీ, అమెరికాకు (America) చెందిన ఓ మహిళ గత మూడేళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంది.

అమెరికాకు చెందిన పాపీ (Papi) అనే మహిళ అరుదైన సమస్యతో బాధపడుతుంది. గత మూడేళ్లుగా ప్రతి రోజూ రక్తస్రావం జరుగుతుందని పాపీ స్వయంగా తెలిపింది. తరచూ తలనొప్పి, తిమ్మిర్లు, కండరాల నొప్పులతో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పింది. మొదట్లో రెగ్యూలర్ పిరియడ్స్ అనుకుని పట్టించుకోలేదని, అనంతరం ఈ సమస్య గురించి ఎవరికైనా చెబితే తన గురించి తప్పుగా అనుకుంటారని భయంతో ఎవరితోనూ పంచుకోలేదని తెలిపింది. అనంతరం ధైర్యం చేసి వైద్యులను సంప్రదించనట్లు చెప్పింది.

అయితే, ఎంతమంది వైద్యులను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతోంది. పలు ట్రీట్మెంట్లు, టెస్టుల అనంతరం తనకు 'బైకార్నుయేట్ యుటెరస్' కారణంగా పీరియడ్స్ ఆగడంలేదని, ఈ పరిస్థితి అత్యంత అరుదైనదని వైద్యులు చెప్పారని వివరించింది. బైకార్ నేట్ యుటిరస్ అంటే గర్భాశయం హృదయంలాగా ఏర్పడి రెండు చాంబర్లుగా విడిపోతుంది. ప్రపంచంలో కేవలం 5 శాతం మంది మహిళలు మాత్రమే ఈ పరిస్థితిని ఎదుర్కొంటారని తెలిపింది.

ఇక తాజాగా వైద్యులు తన సమస్యకు పరిష్కారం కనిపెట్టారని సంతోషం వ్యక్తం చేసింది. వైద్యులు ఆపరేషన్ ద్వారా తన సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పింది. కాగా, రోజూ పీరియడ్స్ రావడంతో తనకు చాలా సమస్యలు ఎదురయ్యాయని, తన సంపాదనలో పెద్దమొత్తం ప్యాడ్స్ సహా ఇతరత్రా నెలసరి ఉత్పత్తుల కొనుగోలుకే వెచ్చించాల్సి వచ్చిందని పాపీ వివరించారు. పీరియడ్స్ లేకుండా ఉంటే ప్రతీ రోజూ ఓ స్వర్గమేనని తాను భావిస్తున్నట్లు పాపీ పేర్కొన్నారు.

Next Story