అమ్మాయిల్లో నిశ్శబ్ద అనారోగ్య సంక్షోభం

by Sujitha Rachapalli |

బోర్డ్ రూమ్స్, నైట్ షిఫ్టులు, అర్ధరాత్రి వరకు ల్యాప్ టాప్ స్క్రీన్ల ముందు కూర్చోవడాలు.. యువతుల నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తున్నాయి.

అమ్మాయిల్లో నిశ్శబ్ద అనారోగ్య సంక్షోభం
X

దిశ, ఫీచర్స్ : బోర్డ్ రూమ్స్, నైట్ షిఫ్టులు, అర్ధరాత్రి వరకు ల్యాప్ టాప్ స్క్రీన్ల ముందు కూర్చోవడాలు.. యువతుల నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తున్నాయి. పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ (PMOS), థైరాయిడ్ డిస్‌ఫంక్షన్, అడ్రినల్ ఫాటిగ్, పెరిమెనోపాజ్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక తరాన్ని నిర్వచించే ఆరోగ్య సవాళ్లుగా మారుతున్నాయి.

స్ట్రెస్-హార్మోన్ స్పైరల్

టార్గెట్స్, సుదీర్ఘ ప్రయాణాలు, జాబ్ ఇన్‌సెక్యూరిటీ, ఇంటి పనుల అదనపు భారంతో.. అమ్మాయిలు దీర్ఘకాలిక ఒత్తిడి ఫేస్ చేస్తున్నారు. దీని కారణంగా రక్త ప్రవాహలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఇది కొద్ది కాలం జరిగితే ఓకే కానీ నెలలు, సంవత్సరాల తరబడి కొనసాగితే.. హార్మోన్ల సూక్ష్మ సమతుల్యతను దెబ్బతీస్తుంది. పెరుగుతున్న కార్టిసాల్ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. థైరాయిడ్ సిగ్నలింగ్‌ను ఆటంకపరుస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని అస్థిరపరుస్తుంది. ఇలా జరగడం వల్ల చాలా మంది యువతుల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సడెన్ వెయిట్ చేంజెస్, చర్మ సమస్యలు, తీవ్ర అలసట, కారణం తెలియని ఆందోళనగా వ్యక్తమవుతుంది. ఇవి తరచుగా ఓన్లీ స్ట్రెస్ మాత్రమే అని కొట్టిపారేయబడతాయి. కానీ సంవత్సరాల తర్వాతే అసలు డిసీజ్ డయాగ్నోస్ అవుతుంది.

నిద్ర లేమి.. శరీర గడియారం

మోడ్రన్ వర్క్ కల్చర్ నిద్రపై యుద్ధం ప్రకటించినట్లుగా అనిపిస్తుంది. పోటీ పరిశ్రమల్లో యువతులు రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారు. టైమ్ జోన్లు మార్చి పని చేయడం సర్కాడియన్ రిథమ్‌ను మరింత దెబ్బతీస్తుంది. నిద్రా చక్రాన్ని నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ పునరుత్పత్తి హార్మోన్లను కూడా నియంత్రిస్తుంది. స్క్రీన్ ఎక్స్‌పోజర్, ఆర్టిఫిషియల్ లైట్, అనియమిత షెడ్యూల్‌ల వల్ల మెలటోనిన్ అణచివేయబడితే.. మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్‌పై ప్రభావం పడుతుంది.

డైట్ ఫ్యాక్టర్

ఎన్నో అచీవ్‌మెంట్స్ చేసిన మహిళలు ఆశ్చర్యకరంగా.. సమయం లేదనే కారణంతో అన్‌హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక కెఫీన్ తీసుకోవడం.. రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పదేపదే పెంచుతున్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రస్తుతం PCOS (పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్)కి మెయిన్ రీజన్‌గా గుర్తించబడుతోంది. భారతదేశంలో పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో ఇది అత్యంత సాధారణ ఎండోక్రైన్ డిసీజ్ కాగా ప్రతీ ఐదు మంది యువతుల్లో ఒకరిని ప్రభావితం చేస్తుంది.

సామాజిక ఒత్తిడి

అమ్మాయిలలో ఒత్తిడికి జీవశాస్త్రం కంటే మించిన సొసైటల్ స్ట్రక్చర్స్ కారణమవుతున్నాయి. యువతులు వృత్తిపరంగా ఉత్తమ స్థాయిలో పని చేయాలని.. అదే సమయంలో సమాజం విధించే అంచనాలు.. అంటే వివాహం, పిల్లలు, బాడీ మెయింటెనెన్స్, ఇంటి బాధ్యతలు కూడా నెరవేర్చాలని ఆశించబడుతున్నారు. ఈ దీర్ఘకాలిక మానసిక భారం అంతర్గతం కాదు. దీన్ని మెటబాలిక్ పరంగా కూడా కొలవవచ్చు. లింగ-ఆధారిత వర్క్‌ప్లేస్ వివక్ష, భావోద్వేగ శ్రమ.. ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లు, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయని అధ్యయనాలు నిరూపించాయి. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనే అవగాహన పెరుగుతోంది, కానీ చర్యలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో మహిళల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకునే వర్క్‌ప్లేస్ వెల్‌నెస్ పాలసీల కోసం డిమాండ్ పెరుగుతోంది.

Next Story