సంతాన కలల కోసం.. మనుషులే దేవతలవుతున్నారు! IVF వెనుక దాగి ఉన్న అద్భుతం!

by Yella Dhawani Reddy |

తల్లిదండ్రులు కావాలనే కోరిక ప్రతి జంటలో చాలా సహజమైనది. కానీ ఆధునిక జీవనశైలి, ఒత్తిడులు, ఆరోగ్య సమస్యల వల్ల సహజంగా గర్భధారణ సాధ్యపడని పరిస్థితులు ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయి.

సంతాన కలల కోసం.. మనుషులే దేవతలవుతున్నారు! IVF వెనుక దాగి ఉన్న అద్భుతం!
X

దిశ, వెబ్ డెస్క్: తల్లిదండ్రులు కావాలనే కోరిక ప్రతి జంటలో చాలా సహజమైనది. కానీ ఆధునిక జీవనశైలి, ఒత్తిడులు, ఆరోగ్య సమస్యల వల్ల సహజంగా గర్భధారణ సాధ్యపడని పరిస్థితులు ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి సమయంలో, వైద్య విజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పు.. IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్), ICSI (ఇన్‌ట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) వంటి సాంకేతికతలు అలాంటి జంటలకు భవిష్యత్తు ఆశలుగా మారాయి. తల్లిదండ్రులయ్యే కలను సాకారం చేస్తూ, ఐవీఎఫ్ సెంటర్లు దంపతుల జీవితాల్లో చేరగని సంతోషాన్ని నింపుతున్నాయి. నిశ్శబ్ధంగా ల్యాబ్‌ల్లో వైద్య శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తోన్నారు. తాజాగా ఈ టెక్నాలజీకి సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. మరీ ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఐసిఎస్ఐ అనేది అత్యంత అధునాతనమైన ఫెర్టిలిటీ టెక్నాలజీ. దీనిలో ఒకే శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెట్టి ఎంబ్రియోను సృష్టిస్తారు. ఇది ముఖ్యంగా పురుషుల ఫెర్టిలిటీ సమస్యలున్న దంపతులకు ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ఎంతో సూక్ష్మంగా, ఖచ్చితంగా IVF ల్యాబ్‌లో ఎంబ్రియాలజిస్టుల చేతుల్లో జరుగుతుంది. ప్రతి ఎంబ్రియోను ఎంతో శ్రద్ధగా, ప్రేమతో సంరక్షించి, దంపతులకు తల్లిదండ్రులయ్యే ఆనందాన్ని అందిస్తారు. దీంతో జీవితంలో ఆశలు కోల్పోయిన ఎంతో మంది దంపతులకు ఈ సాంకేతికతలు ఆశాజనకంగా మారాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ఎంబ్రియాలజిస్టులు నేటి తరం దంపతుల్లో చాలా మందికి చిన్న బ్రహ్మాలుగా మారారు.

Next Story