- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్ల రాగులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఏంటో తెలుసుకోండి!
కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవటంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాలను తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా మిల్లెట్స్‌ను అధికంగా తింటున్నారు. చిరు ధాన్యాల్లో అనేక రకాలు ఉన్నాయి. ఇందులో చాలా మంది తినేవాటిల్లో రాగులు కూడా ఒకటి. ఇక రాగుల అనగానే మనకు ఎరుపు రంగులో ఉండేవి గుర్తుకు వస్తాయి. కానీ తెలుపు రంగులో ఉండే రాగులు కూడా ఉంటాయి. వీటి వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
తెల్ల రాగుల్లో జింక్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. ముఖ్యంగా జ్వరం వచ్చిన వారు తెల్ల రాగులతో జావ చేసి తాగుతుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే తెల్ల రాగులతో చేసిన జావ శరీరానికి చలువ చేస్తుంది. వేడిని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ బారి నుంచి రక్షించబడతారు.
తెల్ల రాగుల్లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే నీరసం, అలసట తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ రాగులు ఎంతో మేలు చేస్తాయి. తెల్ల రాగుల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. తెల్ల రాగుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీరం యాక్టివ్‌గా ఉండేలా చూస్తాయి.






