- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fatty Liver : మద్యం సేవించకపోయినా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.. ఎందుకో తెలుసా..?
Fatty Liver : సాదారణంగా నిత్యం మద్యం సేవించే వారికి ఫ్యాటీ లివర్ వస్తుందని చెబుతుంటారు. కానీ కొంత మంది మద్యం సేవించకపోయినప్పటికీ

Fatty Liver : సాదారణంగా నిత్యం మద్యం సేవించే వారికి ఫ్యాటీ లివర్ వస్తుందని చెబుతుంటారు. కానీ కొంత మంది మద్యం సేవించకపోయినప్పటికీ ఫ్యాటీ లివర్ వస్తుంటుంది. అసలు వారికి అది ఎందుకు వస్తుందో అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే డాక్టర్ పాల్ కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. మీరు మద్యం తాగకపోతే కాలయం దెబ్బతినదు అని అనుకోవడం అపోహ అని వెల్లడించారు. లివర్ సమస్యలకు ప్రధాన కారణాలు మన జీవన శైలి. తరుచూ మనం పాటించే అలవాట్లే అని చెప్పుకొచ్చారు.చాలా మంది కాలేయ సమస్యలు మద్యపానం చేసే వారికే వస్తాయని భావిస్తారు. మనం ప్రతిరోజూ తినే ఆహారపు అలవాట్లలోనే ప్రమాదం ఉందని.. ఆరోగ్య నిపుణులు చెబుతారు. కాలేయ నష్టానికి సంబంధించిన ప్రారంభ లక్షణాలు సాధారణంగా గుర్తించలేమని తెలిపారు. అవి స్పష్టంగా కనిపించే సమయానికి కాలేయం చాలా వరకు దెబ్బతిన్నదనే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తాను చూస్తున్న కాలేయ సమస్యలు మద్యం వల్ల కాదని డాక్టర్ పాల్ తెలిపారు. నేను మద్యం తాగను కాబట్టి నా లివన్ బాగానే ఉంటుంది అనే నమ్మకం సరైంది కాదని తెలిపారు. ముఖ్యంగా చక్కర అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, చిన్న చిన్న చిరుతిళ్లు తింటూ ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం, నిరంతరం ఒత్తిడి అనుభవించడం మొదలైనవి కలిసి కాలేయం పై ఒత్తిడి పెంచి దాని పనితీరును క్రమంగా దెబ్బతీస్తాయని తెలిపారు. మరోవైపు కాలేయానికి స్వయం చికిత్స సామర్థ్యం ఉంటుంది. మన జీవన శైలి, ఆహారంలో మార్పులు చేస్తే.. పేరు ఆరోగ్యం మెరుగుపడితే, సరైన ఆహారపు అలవాట్లు ఏర్పరచుకుంటే ఈ సమస్య నయం అవుతుంది. కాబట్టి మద్యం సేవించని వారు కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం.






