మీకు ఈ అలవాట్లు ఉన్నాయా ? అయితే మీ బ్రెయిన్ డేంజర్లో ఉన్నట్లే..

by Naga Rani Yarlagadda |

శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. కానీ అనేక మంది గమనించకుండా రోజూ చేసే కొన్ని చిన్న అలవాట్లు మెదడుకు నష్టాన్ని కలిగిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది.

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా ? అయితే మీ బ్రెయిన్ డేంజర్లో ఉన్నట్లే..
X

దిశ, వెబ్‌డెస్క్: శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. కానీ అనేక మంది గమనించకుండా రోజూ చేసే కొన్ని చిన్న అలవాట్లు మెదడుకు నష్టాన్ని కలిగిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ అలవాట్లు జ్ఞాపకశక్తి కోల్పోవడం, తీవ్రమైన మానసిక సమస్యలు, లేదా నాడీ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మరి ఆ అలవాట్లు ఏమిటో, అవి ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం.

నియమితంగా వ్యాయామం చేయడం వల్ల మెదడులో Brain-Derived Neurotrophic Factor (BDNF) అనే ప్రొటీన్ విడుదలవుతుంది. ఇది కొత్త జ్ఞాపకాలు ఏర్పడటానికి, నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచటానికి సహాయపడుతుంది.

వ్యాయామం లేకపోతే, మెదడులో ముఖ్యమైన భాగాలు shrink అవుతూ... దీర్ఘకాలికంగా cognitive decline వస్తుంది. సో రోజూ ఎక్సర్ సైజ్ చేయడం మెదడుకు మంచిది. చేయలేని వారు ప్రతివారం కనీసం 150 నిమిషాల brisk walking చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోజులో ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ చూసే అలవాటు, OTT binge-watching – ఇవన్నీ నిద్రను పాడుచేసే శత్రువులు. నిద్ర సమయంలోనే మెదడు కొత్త సమాచారం నిల్వచేస్తుంది. జ్ఞాపకాలను process చేస్తుంది. తక్కువ నిద్ర వల్ల అల్జీమర్స్ వంటి నాడీ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మానసిక స్థితి, దృష్టి, స్పందన సామర్థ్యం పడిపోతాయి. కాబట్టి ప్రతి రాత్రి 8-9 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి.

ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, చిప్స్.. ఇవంటే చాలామందికి ఇష్టం. కానీ వాటిలో ఉన్న అధిక కొవ్వులు, చక్కెరలు మెదడులో దీర్ఘకాలిక వాపు (chronic inflammation) కలిగిస్తాయి. ఇది జ్ఞాపకాలను కోల్పోవడం, మెంటల్ క్లారిటీ లేకపోవడం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. మెదడు ఆరోగ్యానికి Mediterranean Diet ఉత్తమమైనది. కూరగాయలు, పండ్లు, మెత్తని ధాన్యాలు, ఒమేగా-3 కలిగిన చేపలు, జైతూన్ నూనె మొదలైనవి మెదడును రక్షిస్తాయి.

ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపితే శరీర ఆరోగ్యమే కాదు, మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సూర్యకాంతి ద్వారా వచ్చే విటమిన్ D లోపం, మెదడులో సెరోటోనిన్ స్థాయిలు తగ్గిపోవడం, సీజనల్ డిప్రెషన్ మొదలైన సమస్యలు రావచ్చు. ప్రతి రోజు కనీసం 15 నిమిషాలు వెలుతురులో గడపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

సాధారణంగా ఒత్తిడి వచ్చినప్పుడు శరీరం కా ర్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఒకసారి ఒత్తిడి తీరిపోతే ప్రమాదం లేదు. కానీ దీర్ఘకాలంగా ఒత్తిడిలో ఉంటే.. మెదడు నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల గమనించే శక్తి, జ్ఞాపకశక్తి, మనోస్థితి దెబ్బతింటాయి. దీని వలన పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ధ్యానం, ప్రాణాయామం, యోగా, కౌన్సెలింగ్‌ వంటి మానసిక ఆరోగ్య పద్ధతులు ఈ ఒత్తిడిని నియంత్రించడంలో దోహదపడతాయి.

Next Story