ORS కు బదులుగా ORSL తాగుతున్నారా?

by Jakkula Samataha |

కాస్త నీరసం, అలసటగా అనిపిస్తే చాలా చాలా మంది ORS తాగుతుంటారు. ముఖ్యంగా నీరసంతో కళ్లు తిరిగి పడిపోతే వైద్యులు కూడా ఓఆర్ఎస్ తాగమని చెప్తుంటారు. ముఖ్యంగా శరీరంలో తగినంత ద్రవాలు లేనిపక్షంలో తరచుగా డీహైడ్రేషన్‌కు గురి

ORS కు బదులుగా ORSL తాగుతున్నారా?
X

దిశ, ఫీచర్స్ : కాస్త నీరసం, అలసటగా అనిపిస్తే చాలా చాలా మంది ORS తాగుతుంటారు. ముఖ్యంగా నీరసంతో కళ్లు తిరిగి పడిపోతే వైద్యులు కూడా ఓఆర్ఎస్ తాగమని చెప్తుంటారు. ముఖ్యంగా శరీరంలో తగినంత ద్రవాలు లేనిపక్షంలో తరచుగా డీహైడ్రేషన్‌కు గురి కావాల్సి వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడటానికి ఓరల్ రీహైడ్రేషన్ లవణాల ఓఆర్ఎస్ ‌ను తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇది మన శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. దీనిని ఎక్కువగా విరేచనాలు, వాంతులు, జ్వరం, ఉబ్బరంగా అనిపించినప్పుడు తప్పకుండా తీసుకోవాలని వైద్యులు చెబుతారు. దీంతో వైద్యుల సలహాతో అందరూ షాప్‌కు వెళ్లి ఓఆర్ఎస్ కొనుగోలు చేసి తెచ్చుకుని తాగుతుంటారు.

అయితే ఈ మధ్య ORSతో పాటు ORSL కూడా మార్కె్ట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అలాగే ORS,ORSL పేర్లు చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. దీంతో చాలా మంది అయోమయానికి గురి అవుతున్నారు. ఓఆర్ఎస్‌తో పోలీస్తే యాపిల్, ఆరెంజ్, లెమెన్ ఫ్లేవర్స్‌లలో ఓఆర్ఎస్‌ఎల్ లో 10 రేట్లు ఎక్కువగా షుగర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. దీంతో డయాబెటీస్ వ్యాధిగ్రస్థులు , వృద్ధులు రీ హైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్‌కు బదులు పొరపాటున ఓఆర్ఎస్‌ఎల్ తాగితే షుగర్ లెవెల్స్ భారీగా పెరుగుతాయని, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అందువలన ORS,ORSL తేడా గమనించి వాటిని కొనుగోలు చేసి తాగాలంట.

Next Story