మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగుతున్నారు? ఎంత డేంజరో తెలుసా?

by Naga Rani Yarlagadda |

చాలామంది తమ రోజును ఒక కప్పు వేడి చాయ్‌తో ప్రారంభిస్తారు. బ్లాక్ టీ, పాలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారైన ఈ చాయ్ కేవలం పానీయం మాత్రమే కాదు, ఒక ఆచారం. ఉదయం లేదా మధ్యాహ్నం రిఫ్రెష్‌మెంట్‌గా తాగే ఈ చాయ్ మన హృదయాన్ని గెలుచుకుంటుంది.

మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగుతున్నారు? ఎంత డేంజరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: చాలామంది తమ రోజును ఒక కప్పు వేడి చాయ్‌తో ప్రారంభిస్తారు. బ్లాక్ టీ, పాలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారైన ఈ చాయ్ కేవలం పానీయం మాత్రమే కాదు, ఒక ఆచారం. ఉదయం లేదా మధ్యాహ్నం రిఫ్రెష్‌మెంట్‌గా తాగే ఈ చాయ్ మన హృదయాన్ని గెలుచుకుంటుంది. కానీ.. మీరు ఇష్టపడే ఈ చాయ్ లేదా గ్రీన్ టీ అతిగా తాగితే కిడ్నీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా మీరు ఎక్కువ మొత్తంలో తాగుతుంటే లేదా కిడ్నీ సమస్యలకు గురయ్యే రిస్క్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సమస్య మొత్తం ఆక్సలేట్లలో ఉంది. ఇవి టీతో సహా అనేక మొక్కల ఆహారాలలో సహజంగా లభించే సమ్మేళనాలు. అతిగా ఆక్సలేట్లు తీసుకుంటే శరీరం వాటిని బయటకు పంపలేకపోవచ్చు. ఈ ఆక్సలేట్లు మూత్రంలో కాల్షియంతో కలిసి కిడ్నీ రాళ్లను ఏర్పరుస్తాయి. బ్లాక్ టీలో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. రోజుకు 6-8 కప్పులు అతిగా టీ తాగడం కిడ్నీల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. గ్రీన్ టీ, హెర్బల్ టీలలో ఆక్సలేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, వాటిని నీరు తాగినట్లు అతిగా తాగడం మంచిది కాదు.

2015లో అమెరికాలో ఒక వ్యక్తి రోజుకు 16 కప్పుల ఐస్‌డ్ టీ తాగడం వల్ల కిడ్నీ వైఫల్యానికి గురయ్యాడు. ఈ అసాధారణ కేసును న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ “ఐస్‌డ్ టీ నెఫ్రోపతి”గా పేర్కొంది. 56 ఏళ్ల ఆ వ్యక్తి రోజుకు 16 కప్పుల ఐస్‌డ్ టీ తాగేవాడు. ఇది రోజుకు 1,500 మిల్లీగ్రాములకు పైగా ఆక్సలేట్లను అందించింది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం.. రోజుకు 40-50 మిల్లీగ్రాముల ఆక్సలేట్లు మాత్రమే తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది.

ఇండియన్ టీ తాగుతున్నారా?

సాంప్రదాయ మసాలా చాయ్ బ్లాక్ టీని బేస్‌గా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇందులో ఆక్సలేట్లు ఉంటాయి. అయితే.. మనం సాధారణంగా చాయ్‌ను పాలతో కలిపి మరిగిస్తాం. పాలలోని కాల్షియం ఆక్సలేట్లతో పేగులోనే కలిసి, అవి రక్తంలోకి, అక్కడి నుంచి కిడ్నీలకు చేరకుండా నిరోధిస్తుంది. కాబట్టి పాలతో కలిపిన చాయ్ సాదా బ్లాక్ టీ కంటే కొంచెం తక్కువ ప్రమాదకరం. అయినప్పటికీ కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు లేదా కుటుంబ చరిత్రలో ఈ సమస్య ఉన్నవారు రోజుకు 2-3 కప్పులకు పరిమితం కావడం మంచిది.

Next Story