ఖాళీ కడుపుతో ఈ ఫుడ్స్ అస్సలు తినకూడదని తెలుసా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-18 22:01:08  IST  )

మన ఆరోగ్యం దాదాపుగా మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఉదయం లేవగానే చాలామంది భుజించే ఆహారాలు ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు.

ఖాళీ కడుపుతో ఈ ఫుడ్స్ అస్సలు తినకూడదని తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఆరోగ్యం దాదాపుగా మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఉదయం లేవగానే చాలామంది భుజించే ఆహారాలు ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు. కానీ కొన్నిరకాల పండ్లు, కూరగాయలు ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి ప్రతికూల ప్రభావాలు పడతాయని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నారింజ, మోసంబి (Citrus fruits)

విటమిన్ C అధికంగా ఉండే ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తినడం వల్ల ఇది కడుపులో ఆమ్లత (acidity) లేదా గ్యాస్ ను పెంచుతుంది.

అనాస (Pineapple)

ఇందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపు లోపల దురదరించే లక్షణాలు, వాంతులు కలగవచ్చు.

టమోటా

టమోటాలో ఉండే టానిక్ యాసిడ్ ఖాళీ కడుపున పేగుల గోడలపై ప్రభావం చూపిస్తుంది. ఇది అల్సర్లు ఉన్నవారికి ప్రమాదం కలిగించవచ్చు.

వెల్లులి (Raw Garlic)

వెల్లులిలో ఉండే అలిసిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీసెప్టిక్. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది కడుపులో మండింపును, అజీర్ణాన్ని కలిగించవచ్చు.

మిరపకాయలు (Raw Chilies)

ఇవి ఖాళీ కడుపున తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కలిగిస్తుంది. గ్యాస్, మంట, కడుపులో అసౌకర్యం ఏర్పడుతుంది.

కాఫీ/టీ ఖాళీ కడుపుతో తీసుకుంటే పేగులకు ఇర్రిటేషన్ కలుగుతుంది.

కూల్ డ్రింక్స్/కార్బొనేటెడ్ వాటర్: ఇది పెరిగిన ఆమ్లతతో కలిపి కడుపులో సమస్యలకు దారి తీస్తుంది.

గోధుమ రవ్వ గంజి, మాగిన అరటి పండు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వంటివి తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story