హెల్తీ డ్రింక్ అని ఎగ‌బ‌డి తాగితే లివ‌ర్ దొబ్బింది.. డాక్ట‌ర్ చెప్పిన షాకింగ్ నిజాలు

by Ajay Maddhiboyina |

డాక్ట‌ర్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం..28ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యువ‌కుడు బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌తిరోజూ జ్యూస్ తాగ‌డం మొద‌లుపెట్టాడు. తిండి మానేసి రోజూ మూడు పూట‌లా మూడు గ్లాసుల జ్యూస్ తాగ‌డం అల‌వాటుగా చేసుకున్నాడు.

హెల్తీ డ్రింక్ అని ఎగ‌బ‌డి తాగితే లివ‌ర్ దొబ్బింది.. డాక్ట‌ర్ చెప్పిన షాకింగ్ నిజాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: కొంత‌మంది ఆరోగ్యంపై అతిగా శ్ర‌ద్ధ తీసుకుంటూ అనారోగ్యం పాల‌వుతున్నారు. ఆ డైట్ ఈ డైట్ అంటూ లేనిపోని ఆహార నియమాల‌తో ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు వాట‌ర్ డైట్, ఫ్రూట్ డైట్ అంటూ క‌డుపుమాడ్చుకుని ప్రాణాలమీద‌కు తెచ్చుకున్న ఘ‌ట‌న‌లు వినే ఉంటారు. ఇప్పుడు ఓ వ్యక్తి జ్యూస్ డైట్ చేయ‌డంతో అత‌డి లివ‌ర్ పూర్తిగా పాడైపోయింది. మందుతాగ‌డం, జంక్ ఫుడ్ తిన‌డంలాంటి అల‌వాట్లు లేక‌పోయినా అతిగా జ్యూస్ లు తాగ‌డం వ‌ల్లే అత‌డి లివ‌ర్ పాడైపోయింది.

ఈ విష‌యాన్ని ఓ డాక్ట‌ర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతోంది. డాక్ట‌ర్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం..28ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే యువ‌కుడు బ‌రువు త‌గ్గేందుకు ప్ర‌తిరోజూ జ్యూస్ తాగ‌డం మొద‌లుపెట్టాడు. తిండి మానేసి రోజూ మూడు పూట‌లా మూడు గ్లాసుల జ్యూస్ తాగ‌డం అల‌వాటుగా చేసుకున్నాడు. అలా కొన్ని నెల‌ల పాటు న్యాచుర‌ల్ జ్యూస్ అని మార్కెట్ లో ల‌భించే ప్యాకెట్ జ్యూస్ ల‌ను కంటిన్యూగా తాగేవాడు. ఈ క్ర‌మంలో అనారోగ్యానికి గుర‌వ్వ‌గా ఆస్ప‌త్రికి వెళితే వైద్యులు ఫ్యాటీ లివ‌ర్ 3వ స్టేజిలో ఉన్న‌ట్టు తెలిపారు.

సాధార‌ణంగా పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అందులోని షుగ‌ర్ అంటే ఫ్ర‌క్టోజ్ తో పాటు ఫైబ‌ర్ కూడా శ‌రీరానికి అందుతుంద‌ని చెప్పారు. కానీ జ్యూస్ లో ఫైబ‌ర్ ఉండ‌దు కాబ‌ట్టి కేవ‌లం ఫ్ర‌క్టోజ్ ను మాత్ర‌మే శ‌రీరానికి అందుతుంద‌ని తెలిపారు. శ‌రీరంలో ఫ్రక్టోజ్ ను లివ‌ర్ మాత్ర‌మే ప్రాసెస్ చేస్తుంద‌ని అన్నారు. గ్లూకోజ్ ను ఇత‌ర అవ‌య‌వాలు అవ‌స‌రానికి త‌గిన‌ట్టు తీసుకుంటాయి కానీ ఫ్ర‌క్టోజ్ మాత్రం లివర్ లోనే ఫ్యాట్ గా స్టోరేజ్ అవుతుంద‌న్నారు. దాని వ‌ల్ల యువ‌కుడికి నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ వ‌చ్చింద‌ని చెప్పారు.

Next Story