ఏ సమయంలో టీ తాగితే మంచిదో తెలుసా

by Sridhar Babu |

టీ ఎప్పుడు పడితే అప్పుడు తాగడం కంటే ఓ ప్రత్యేకమైన సమయంలో తాగితే అది ఒంటికిపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఏ సమయంలో  టీ తాగితే మంచిదో తెలుసా
X

దిశ, వెబ్​డెస్క్​ : టీ ఎప్పుడు పడితే అప్పుడు తాగడం కంటే ఓ ప్రత్యేకమైన సమయంలో తాగితే అది ఒంటికిపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. దాంతో అజీర్తి చేస్తుంది. కాలక్రమేణా పంటి ఎనామిల్ కూడా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదట. గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. టీలోని టానిన్ ఆహారం నుండి ఇనుమును గ్రహించకుండా నిరోధిస్తుంది. అందుకే టీ తాగడానికి మధ్యాహ్నం 3 గంటలు ఉత్తమ సమయం అని పేర్కొంటున్నారు . ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మార్నింగ్ టీ తాగాలంటే పంచదార బదులు బెల్లంతో టిఫిన్​ చేసిన తర్వాత తాగితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story