పసి పిల్లలు ఏడిస్తే లైట్ తీసుకుంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నారని హెచ్చరించిన శాస్త్రవేత్తలు

by Sujitha Rachapalli |

సాధారణంగా చిన్న పిల్లలు ఏడిస్తే కొందరు లైట్ తీసుకుంటారు. ఏడిస్తేనే మంచిదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి సొసైటీలో. కానీ ఇదంతా

పసి పిల్లలు ఏడిస్తే లైట్ తీసుకుంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నారని హెచ్చరించిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా చిన్న పిల్లలు ఏడిస్తే కొందరు లైట్ తీసుకుంటారు. ఏడిస్తేనే మంచిదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి సొసైటీలో. కానీ ఇదంతా మూఢనమ్మకమని.. పిల్లల ఏడుపును పట్టించుకోకపోతే మెదడు ఎదుగుదలపై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది జపాన్ ఎన్విరాన్మెంట్ అండ్ చిల్డ్రన్స్ స్టడీ (JECS) అధ్యయనం. 100,000 కంటే ఎక్కువ మంది తల్లి-బిడ్డలను పరిశీలించిన పరిశోధకులు.. శిశువు ఏడుపును నిరంతరం పట్టించుకోకపోవడం వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం, మోటార్ స్కిల్స్ (పాకడం, నడవడం), సమస్య పరిష్కారం, ఇతరులతో కమ్యూనికేట్ కావడంలో ఆలస్యానికి దారితీస్తుందని గుర్తించింది. మొత్తానికి ఏడుపుకు ప్రతిస్పందన లేని సంరక్షణ.. శిశువు భావోద్వేగ నియంత్రణ, సురక్షిత బంధాన్ని దెబ్బతీస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన అభివృద్ధికి కీలకం.

ఎక్కువ సేపు ఏడవడం కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఇది హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్ (HPA) అక్షాన్ని అతిగా ఉత్తేజితం చేస్తుంది. శిశువులలో ఎక్కువ కార్టిసాల్ స్థాయిలు మెదడు నిర్మాణంలో మార్పులకు దారితీస్తాయి. ముఖ్యంగా భావోద్వేగ నియంత్రణ, స్ట్రెస్ ప్రతిస్పందనను నియంత్రించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అమిగ్డాలాలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది బాల్యంలో ఆందోళన, దూకుడు, తక్కువ IQకి దారితీస్తుందని చూపిస్తున్నాయి. అసురక్షితంగా ఉన్నాననే భావన.. పిల్లల్లో భావోద్వేగ, ప్రవర్తన సమస్యలకు దారితీస్తుందని చూపిస్తుంది. కాగా చిన్నారుల ఏడుపుకు ఎప్పుడో ఒక్కసారి ప్రతిస్పందన లేకపోవడం నిరంతర నిర్లక్ష్యం నుంచి భిన్నంగా ఉంటుంది.

Next Story