రోజుకు 100 కంటే ఎక్కువ సార్లు ఫోన్ చూస్తున్నారా.. ప్రమాదానికి దగ్గర్లోనే ఉన్నారు..

by Sujitha Rachapalli |

రోజుకు ఎన్ని సార్లు ఫోన్ చెక్ చేస్తున్నారు? మీ మెదడును మీరెంత కష్టపెడుతున్నారో తెలుసా? మీరు చేసే పనిని మళ్లీ మొదలుపెడుతున్నారని మీకు తెలుసా?

Turn on these settings on your mobile phone to stay safe during India-Pakistan tensions telugu news
X

Viral Video: భారత్ - పాక్ ఉద్రిక్తత వేళ మీ మొబైల్ ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే సురక్షితంగా ఉంటారు..ఎలాగంటే?

దిశ, ఫీచర్స్ : ఫోన్ లేకుండా బతుకే లేనట్లు తయారైంది పరిస్థితి. ఎంటర్‌టైన్మెంట్‌తోపాటు కూరగాయలు, బట్టలు కొనడం నుంచి కరెంట్ బిల్లులు చెల్లించే వరకు ఆల్మోస్ట్ అన్ని పనులు ఈ ఫోనే చేస్తుంది. బంధువుల ముచ్చట్లు తెలుసుకోవాలన్నా.. వర్క్ అప్డేట్స్ మిస్ కాకూడదన్నా.. దీనితోనే పని. అందుకే సగటు మనిషి రోజుకు 50 నుంచి 100 సార్లు ఫోన్ చెక్ చేస్తుంటడట. ఎవరు మెసేజ్ చేశారు.. ఏం నోటిఫికేషన్ వచ్చింది.. అని చూసుకుంటూ ఉంటారట. కానీ అంతకు మించి ఎక్కువ సార్లు ఫోన్ చూశారో.. ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రోజుకు 50 నుంచి 80 సార్లు చెక్ చేయడం సాధారణంగా ఒక రూల్ ఆఫ్ థంబ్‌గా భావించబడుతుంది. వంద అయినా ఓకే.. కానీ ఆ నంబర్ దాటితే సమస్యాత్మకమైన వినియోగం కిందకు వస్తుంది. ఇది మనిషి అటెన్షన్ స్పాన్, కాగ్నిటివ్ స్కిల్స్‌ రిస్క్‌లను పెంచుతుంది. ఇన్ని సార్లు ఫోన్ చెక్ చేయడం వల్ల జరిగే ఇంటరప్షన్స్.. స్క్రీన్ టైమ్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫోన్ చెక్ చేసిన ప్రతీసారి.. మనం చేస్తున్న పనిని మధ్యలో ఆపేస్తాం కాబట్టి ఆ టాస్క్‌ను పాజ్ చేసి.. మళ్లీ స్టార్ట్ చేయమని ఫోర్స్ చేస్తుంది బ్రెయిన్. ఇలా రోజుకు వందకుపైగా బ్రేక్స్ తీసుకుంటే.. అంటే చేస్తున్న పని నుంచి.. ఫోన్ చెక్ చేయడం మీదక స్విచింగ్ అయితే.. బ్రెయిన్ అలసిపోతుంది. కాలక్రమేణా మన మెదడు లాంగ్ టైమ్ ఫోకస్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. షార్ట్ అటెన్షన్, క్విక్ బ్రేక్‌లకు అలవాటు పడుతుంది. ఒకపని మీద శ్రద్ధ పెట్టకుండా అయిపోతుంది.

ఎలా బయటడాలి?

* ఇంపార్టెంట్ కావనుకునే నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయండి.

* చదువుకోవడం, వాకింగ్ చేయడం లాంటి ఫోకస్డ్ యాక్టివిటీల టైమ్‌లో ఫోన్‌ను దూరంగా పెట్టండి.

* ఫోన్ చెక్ చేయడానికి స్పెసిఫిక్ టైమ్‌లను షెడ్యూల్ చేయండి. మూడు గంటలు లేదా నాలుగు గంటలకు ఓ సారి చెక్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకోండి.

* ఒక పని చేస్తున్నప్పుడు 20–50 నిమిషాలు ఫోకస్ చేసి... ఆ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకోండి.

* పుస్తకాలు చదవడం, శ్వాసపై ధ్యాస పెట్టడం, హాబీలపై ఫోకస్ పెంచడం ద్వారా మెదడు ఫోకస్ చేసే సామర్థ్యాన్ని పెంచండి.

* లేట్ నైట్ ఫోన్ చూడటం మానేసి.. మంచి నిద్రకు ప్రయారిటీ ఇవ్వండి. బ్రెయిన్‌కు సరైన విశ్రాంతి లేదంటే ఫోకస్ తగ్గిపోతుంది.

Next Story