- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
40ఏళ్ల వయసులో స్త్రీ శరీరంలో కలిగే మార్పులు ఇవే..!
* 40 ఏళ్ల వయసులో స్త్రీ శరీరంలో హార్మోన్ల మార్పులు * హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌తో పూర్తి శరీరం ఎఫెక్ట్ * పునరుత్పత్తి వ్యవస్థ నుంచి మూడ్ స్వింగ్స్ వరకు..

దిశ, వెబ్ డెస్క్ : స్త్రీలు 40లలోకి ఎంటర్ అయ్యారంటే హార్మోన్లలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. నిశ్శబ్దంగా జరిగే ఈ చేంజెస్‌ను ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే రెండు హార్మోన్లు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. పునరుత్పత్తి వ్యవస్థ, రుతుస్రావం వంటి విషయాల్లో మార్పులు తీసుకొస్తాయి. పీరియడ్స్ ఆగిపోతాయి. రుతివిరతి దశతో పునరుత్పత్తి సామర్థ్యం పూర్తిగా అంతం అవుతుంది. 40-45 ఏళ్ల మధ్యలో ఇది జరుగుతుంది. అయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేవలం ఇన్‌ఫెర్టిలిటీ, మెనోపాజ్ మాత్రమే కాదు ఉమెన్ బ్రెయిన్ నుంచి బోన్స్ వరకు పూర్తి శరీరంపై ఎఫెక్ట్ చూపుతుంది. నిద్ర రాకుండా ఇబ్బంది పడటం, అలసట, మూడ్ స్వింగ్స్, హెడేక్, బాడీ పెయిన్స్‌తోపాటు జుట్టు రాలడం, తినకుండానే వెయిట్ గెయిన్, స్కిన్ టోన్ చేంజ్ కావడం స్టార్ట్ అవుతుంది.
ఈ మార్పులు స్త్రీ శరీరానికి ప్రమాదకరమే కానీ ఇక్కడితోనే లైఫ్ ఎండ్ కాదనే విషయం గుర్తుంచుకోవాలి. మన శరీరానికి అనుగుణంగా నడుచుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని వివరిస్తున్నారు నిపుణులు. బ్యాలెన్స్‌డ్ డైట్, వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవనం సాగించడం వల్ల హార్మోన్లను నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. ఫైబర్, కాల్షియం అధికంగా ఉండే ఫుడ్.. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలని చెప్తున్నారు.
Read more : కండోమ్ లేకుండా సెక్స్ చేస్తేనే మహిళలు ఎంజాయ్.. ఆహ్లాదం ఇస్తున్న వీర్య స్కలనం






