- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cancer vaccine: క్యాన్సర్‌కు అద్భుతమైన వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా..ట్రయల్స్ 100శాతం సక్సెస్
క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చేసిందని రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్‌పై పోరాడే ఎంట్రోమిక్స్ అనే mRNA ఆధారిత వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ అయ్యిందని ఆర్టీ ఇండియా పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రజలను బయపెడుతన్న అత్యంత ప్రమాదకర వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి వచ్చిందంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. భారత్ తో పాటు అన్ని దేశాల్లోనూ క్యాన్సర్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ వ్యాధి బారినపడి కన్నుమూస్తున్నారు. బతికుండగానే నరకం చూపించే ఈ వ్యాధికి ఇప్పుడు వ్యాక్సిన్ (cancer vaccine) వచ్చేసిందని రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్‌పై పోరాడే ఎంట్రోమిక్స్ (Enteromix) అనే mRNA ఆధారిత వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ అయ్యిందని ఆర్టీ ఇండియా పేర్కొంది.
పెద్ద కణితులను గణనీయంగా తగ్గించడంతో పాటు క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే ముందు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి తుది ఆమోదం కోసం వేచి ఉందని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్‌లలో ఉపయోగించిన మాదిరిగానే అత్యాధునిక mRNA టెక్నాలజీని ఉపయోగించినట్టు తెలిపింది. కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సల మాదిరిగా కాకుండా ప్రతి క్యాన్సర్ పేషెంట్ కు వ్యాక్సిన్ ప్రత్యేకంగా రూపొందించబడుతుంది.
ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ వందశాతం సక్సెస్ అవ్వడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాలు చూపించలేదని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ ను రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఎంగెల్‌హార్డ్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ సహకారంతో రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్ అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అవ్వడంతో ఆరోగ్యమంత్రిత్వ శాఖ అనుమతి లభించిన వెంటనే ఇది మార్కెట్‌లోకి రానుంది. ఈ వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి. ఎంట్రోమిక్స్ చికిత్సలో మెరుగ్గా పనిచేస్తే ఆంకాలజీ రంగంలోనే కొత్త దశ మొదలవుతుంది. అంతే కాకుండా లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చు.






