శాఖాహారులకు బిగ్ షాక్.. ఫ్యాట్ లేయర్ కాపాడుకోకపోతే డేంజర్!

by B.Srinivas |   (  Updated:2026-01-31 13:41:14  IST  )

మాంసం తినేవారితో పోలిస్తే శాఖహారుల్లోనే 33శాతం హిప్ ఫ్రాక్చర్ ప్రమాదం పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

శాఖాహారులకు బిగ్ షాక్.. ఫ్యాట్ లేయర్ కాపాడుకోకపోతే డేంజర్!
X

దిశ, ఫీచర్స్: మాంసం తినేవారికంటే శాఖాహారులే హెల్త్ పరంగా వీక్ ఉన్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా వెజిటేరియన్స్ ఎముకల బలహీనతతో బాధపడుతున్నారని, మహిళల్లో హిప్ ఫ్రాక్చర్ ప్రమాదం పెరిగినట్లు సర్వే పేర్కొంది. మొక్కల ఆధారిత జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ వెటిటేరియన్స్ ఎముకల సాంద్రతకు సంబంధించిన పోషక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రొటీన్ లోపం..ఈ మేరకు యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ 26,000 మందిపై నిర్వహించిన సర్వేలో నాన్‌వెజ్ తినే వారితో పోలిస్తే వెజిటేరియన్ మహిళల్లో హిప్ ఫ్రాక్చర్ ప్రమాదం 33% పెరిగినట్లు వెల్లడించారు. ఎముకల బలానికి అవసరమైన ప్రొటీన్, కాల్షియం, విటమిన్ B12 వంటి పోషకాలు వీరి శరీరంలో తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో బయటపడింది. శాకాహారుల్లో శరీర బరువు (BMI) తక్కువగా ఉండటం దీనికి ఒక కారణం కావచ్చు. వెయిట్ లాస్ అయినవారిలో ఎముకలపై ఒత్తిడిని తగ్గించే కొవ్వుపొర (Fat layer) కరిగిపోతుంది. దీనివల్ల పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పడిపోయినప్పుడు సులభంగా తుంటి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందని తెలిపారు.
ఏం తినాలి?మాసం తినలేనివారు తమ శరీరంలో పోషకాలు అధికంగా ఉండే సూపర్‌ఫుడ్‌లు ఎంచుకోవాలి. ఎముకలు బలహీనంగా మారకుండా ఆకు కూరలు, చిక్కుళ్ళు, పీచు పదార్థాలు, బీ విటమిన్ పోషకాలు లభించే సప్లిమెంట్లను మెనూలో చేర్చాలి. క్రమం తప్పకుండా వ్యాయాయం చేయాలి. ఫిజికల్ స్ట్రెంత్ కాపాడుకోవాలి. పప్పుధాన్యాలు, సోయా, పనీర్, సీడ్స్ ద్వారా తగినంత ప్రోటీన్ అందేలా చూసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు విటమిన్ B12, D సప్లిమెంట్లను వాడాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Next Story