- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వానా కాలంలో వేప ఆకులు ఇలా వినియోగిస్తే.. మలేరియాకు చెక్..
ఔషధ గుణాలు కలిగిన వేపను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వానాకాలంలో వినియోగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. వర్షాకాలం కోసం ప్రకృతి ఇచ్చిన వరం వేప అని..

దిశ; వెబ్‌డెస్క్ : ఔషధ గుణాలు కలిగిన వేపను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వానాకాలంలో వినియోగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. వర్షాకాలం కోసం ప్రకృతి ఇచ్చిన వరం వేప అని.. దీన్ని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. మీ రోజులో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
* యాంటీవైరల్ గుణాలు వేపలో అధికంగా ఉంటాయి. దీనివల్ల వాతావరణంలో వ్యాప్తి చెందే వైరస్‌లు తగ్గుతాయి.
* వేప ఆకులను నీటిలో మరిగించి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. వానాకాలంలో వచ్చే అలెర్జీలకు దూరంగా ఉండొచ్చు. మొటిమలు కూడా తగ్గుతాయి.
* ఇక వేప ఆకుల పొగతో దోమలు ఇంట్లోకి రాకుండా చేయొచ్చు. దీనివల్ల దోమల వల్ల కలిగే మలేరియా వంటి వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
* వేప ఆకుల వాసన మనసును ఆహ్లాదపరుస్తుంది. మెంటల్ స్ట్రెస్ తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది. కాబట్టి మానసిక ఆరోగ్యం కూడా చేకూరుతుంది.
* వేప ఆకులతో చేసిన కషాయం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.






