- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లుంగీ కట్టుకుంటే వృషణాలు భద్రం.. పిల్లలను కనడానికి ఇబ్బంది ఉండదు..
సోషల్ మీడియాలో మంచి-చెడు.. రెండింటికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. కానీ దేన్ని ఎలా స్వీకరించాలో మనపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు డాక్టర్లుగా చెప్పుకుని మిస్ గైడ్ చేస్తుంటే.. కొందరు

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో మంచి-చెడు.. రెండింటికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. కానీ దేన్ని ఎలా స్వీకరించాలో మనపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు డాక్టర్లుగా చెప్పుకుని మిస్ గైడ్ చేస్తుంటే.. కొందరు బాధ్యత కలిగిన వైద్యులు మాత్రం సూచనలతో జనాల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ఇలాంటి ట్వీటే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లుంగీ కట్టుకుంటే లాభాలు అంటూ ఓ డాక్టర్ చెప్పిన మాటలు నిజంగా ఆలోచించేలా చేస్తున్నాయి. అదెలా అంటూ చర్చించేలా చేస్తున్నాయి.
లుంగీ కట్టుకుంటే వృషణాలకు గాలి తగిలి ఆరోగ్యంగా ఉంటాయని తెలిపాడు డాక్టర్. టెస్టోస్టిరాన్ సరైన మోతాదులో తయారవుతుందని.. స్పెర్మ్ కౌంట్ బాగుంటుందని.. తద్వారా పిల్లలను కనడానికి ఇబ్బంది ఉండదని చెప్పాడు. అలాగే గజ్జి, తామర వంటి చర్మవ్యాధులు వచ్చే అవకాశం తక్కువని.. జిప్ యాక్సిడెంట్స్ కూడా అవాయిడ్ చేయొచ్చని చెప్పాడు.






