- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాళీ కడుపుతో అరటి పండు తినడం ప్రమాదకరమా?
అరటి పండు పరిగడుపున తినడం మంచిదేనా? ఎవరు తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయి? షుగర్ పేషెంట్స్‌కు లాభమా? నష్టమా? ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు రావొచ్చా?

దిశ, ఫీచర్స్ : రాత్రంతా తినకుండా ఉన్న తర్వాత ఉదయాన్నే అరటిపండు తీసుకోవడం వల్ల నేచురల్ షుగర్స్ వేగంగా శరీరంలోకి వెళ్లి ఉత్సాహం, ఏకాగ్రతను పెంచుతాయి. అలసటను తగ్గిస్తాయి.ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. విటమిన్ B6 సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడి మూడ్‌ను స్థిరంగా ఉంచుతుంది. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసి కండరాల నొప్పులు, క్రాంప్స్ తగ్గిస్తాయి.
అయితే మధుమేహం, ఇన్సులిన్ సమస్యలు ఉన్నవారికి మాత్రం ఉదయం లేవగానే అరటిపండు తినడం సమస్యను కలిగించవచ్చు అంటున్నారు నిపుణులు. ఖాళీ కడుపుతో తినడం వల్ల చక్కెర స్థాయి వేగంగా పెరిగి తర్వాత క్రాష్ అవుతుంది. దీంతో అలసట పెరిగి, ఆకలి త్వరగా వస్తుంది. కొందరికి ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎసిడిటీ లేదా గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. కేలరీలు ఎక్కువ (సుమారు 100-120 kcal) కాబట్టి కేవలం బనానా తినడం వల్ల పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రోటీన్/ఫ్యాట్ తో కలిపి తినాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా చేస్తే చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది.
- Tags
- Banana






