బీ కేర్ ఫుల్.. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా!

by Jakkula.Mamatha |

రాత్రిపూట నిద్రలో ఈ లక్షణాలు ఉన్నట్లైతే అస్సలే నిర్లక్ష్యం చేయకండి.

బీ కేర్ ఫుల్.. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఉన్నట్టుండి శరీరంలో కనిపించే ఏ చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వయసు పెరిగే కొద్ది కొందరిలో సహజంగా కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సాధారణమే. కానీ కొంత మందిలో వయసుతో సంబంధం లేకుండా శరీరంలో విభిన్న మార్పులు కనిపిస్తాయి. వాటిని అశ్రద్ధ చేయకుడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.

ఇటీవల కాలంలో చాలామంది చిన్న వయస్సులోనే అనేక రకాల అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి వైద్య చికిత్స చేయించుకుని.. సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇదిలా ఉంటే.. రాత్రిపూట చాలామందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా రాత్రిపూట మధుమేహ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నిద్రపోతున్నప్పుడు పాదాలలో ఆకస్మాత్తుగా జలదరింపు, తిమ్మిరి వచ్చినట్లు అనిపిస్తే అందుకు మధుమేహమే కారణం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే.. కంటి చూపు కూడా మందగిస్తుంది. అలాగే, రోజూ రాత్రిపూట ఫ్యాన్ ఆన్ చేసినప్పటికీ చెమటలు పట్టడం, నోరు పొడిబారి దాహంగా అనిపించడం, పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం కూడా మధుమేహ లక్షణాలే. రాత్రి సమయంలో వణుకు, గుండె వేగంగా కొట్టుకోవడం. ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి.. సూచనలు తీసుకుంటే మంచిది.

అయితే.. రాత్రి పూటే ఎందుకు డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయనే సందేహం మీలో కలగవచ్చు. అది ఎలాగంటే.. మీరు నిద్రపోతున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటోంది. ఈ తరుణంలోనే హార్మోన్ స్థాయిలు మారుతూ ఉంటాయి. డయాబెటిస్‌ ఉన్నప్పుడు శరీరానికి సరైన మోతాదులో ఇన్సులిన్ లభించదు. దీంతో రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి లేదా తగ్గడం జరుగుతుంటుంది. వీటితో మధుమేహ లక్షణాలు కపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నోట్: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించండి.

Next Story