Thyroid:థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-19 05:41:59  IST  )

శరీర జీవక్రియలు సవ్యంగా సాగాలంటే థైరాయిడ్ హార్మోన్ సమతుల్యత చాలా ముఖ్యం.

Thyroid:థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?
X

దిశ,వెబ్‌డెస్క్: శరీర జీవక్రియలు సవ్యంగా సాగాలంటే థైరాయిడ్ హార్మోన్ సమతుల్యత చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది థైరాయిడ్ సమస్యతో పోరాడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా థైరాయిడ్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. సాధారణంగా థైరాయిడ్ అనేది హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల ఏర్పడుతుంది. ఒత్తిడి వల్ల హార్మోన్‌ అసమతుల్యం ఏర్పడి థైరాయిడ్‌ హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది.

దీని హెచ్చుతగ్గులను అదుపులో ఉంచడానికి అయోడిన్ కలిగిన ఉప్పుతో పాటు చిక్కుళ్లు, బఠానీలు వంటి పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే విటమిన్ C పండ్లు, చేపలు, ఓట్స్, రాగిజావ వంటి మిల్లెట్స్ ఆహారం లో చేర్చుకోవాలి. వీటితో పాటు సరైన వ్యాయామం, వైద్యుల సలహాలతో మందులు వాడటం వల్ల థైరాయిడ్‌ను సమర్ధవంతంగా నియంత్రించవచ్చు. పీచు పదార్థాలు తినడం, పెరుగు లాంటి ప్రోబయాటిక్స్‌ తీసుకోవడం, తీపికి దూరంగా ఉండటం వల్ల పొట్టలో బ్యాక్టీరియా బాగుండి థైరాయిడ్‌ దుష్ప్రభావం తక్కువగా ఉంటుంది.

గమనిక: పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Next Story