తులసి పక్కనే.. మనీ ప్లాంట్ పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి !

by velandi.Saikiran |

తులసి ( Tulasi), మనీ ప్లాంట్ ( Money Plant) ఈ రెండు చెట్లు కచ్చితంగా... ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతి హిందువు ఇంట్లో ఈ

తులసి పక్కనే.. మనీ ప్లాంట్  పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి !
X

దిశ, వెబ్ డెస్క్: తులసి ( Tulasi), మనీ ప్లాంట్ ( Money Plant) ఈ రెండు చెట్లు కచ్చితంగా... ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతి హిందువు ఇంట్లో ఈ మొక్కలను నాటుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కలకు ప్రతిరోజు పూజ చేస్తారు. అటు సంపాదన ఎక్కువగా ఉండాలని మనీ ప్లాంట్ కూడా ఇండ్లలో పెట్టుకుంటున్నారు. అయితే తులసి, మనీ ప్లాంట్ పక్కపక్కనే పెట్టుకోకూడదు అని కొంతమంది చెబుతున్నారు.

అలా చేస్తే ఇంట్లో.. అశుభం జరిగే ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తులసి, మనీ ప్లాంట్ రెండింటి.. నీడలు ఒకదాని పైన మరొకటి పడకుండా పెట్టాలని సూచనలు చేస్తున్నారు. అలా చేస్తే ఇంటికి సౌభాగ్యం కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా తులసి మొక్కలను ఉత్తరం అలాగే ఈశాన్యం అటు తూర్పు దిశల్లో.. పెట్టుకోవచ్చని అంటున్నారు. పూజా స్థలంలో లేదా వంటగదికి దగ్గరలో... తులసి మొక్కలను నాటాలని చెబుతున్నారు.

ఇక వాస్తు ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ పెట్టుకోవాలని సూచనలు చేస్తున్నారు. అలా చేస్తే ఇంట్లో ఉన్న పేదరికం పోతుందని నిపుణులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ ఆగ్నేయ దిశలో ఉంటే ఇంటి ప్రతికూల శక్తులు... దూరమవుతాయని అంటున్నారు.

Next Story