బరువు పెరుగుతున్నారా..? అయితే ఈ ఆకు కూరలు తినండి సన్నగా తమన్నాలా మారండి..

by Gugulothu.Kavitha |

చాలా మంది ఫుడ్ విషయంలో సరైనా డైట్ పాటించకపోవడం వల్ల చాలా లావైపోతారు.

బరువు పెరుగుతున్నారా..? అయితే ఈ ఆకు కూరలు తినండి సన్నగా తమన్నాలా మారండి..
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఫుడ్ విషయంలో సరైనా డైట్ పాటించకపోవడం వల్ల చాలా లావైపోతారు. అంతేకాకుండా థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ వల్ల కూడా బరువు పెరిగిపోతుంటారు. అయితే ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండవచ్చు. ఇక ఈ సీజన్‌లో లభించే కొన్ని ప్రత్యేక ఆకుకూరలు బరువు తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో కొవ్వు నిల్వలు లేకపోగా, ఫైబర్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల సన్నగా నాజుగ్గా మారుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం బరువును తగ్గించే ఆ ఆకు కూరలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం..

1. మెంతి ఆకులు:

మెంతి ఆకులలో కేలరీల శాతం చాలా తక్కువ. వీటిలో పోషకాలు యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఈ ఆకులు ఆస్కార్బిక్ ఆమ్లం, β-కెరోటిన్ వంటి శక్తిమంతమైన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం (డయాబెటిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా, ఇవి బరువు తగ్గడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి.

2. పాలకూర:

ఆకు కూరల్లో ఒకటైన పాలకూర మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరలో కేలరీలు అతి తక్కువ. కాబట్టి దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నా సులభంగా జీర్ణమవుతుంది. అలాగే ఇందులో ఫైబర్ పుష్కలంగా లభించడం వలన కడుపు నిండుగా ఉన్న భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గి బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

3. ఆవాల ఆకులు:

బరువు తగ్గడానికి సహాయపడే విటమిన్ సి అండ్ ఫైబర్ ఆవాల ఆకులలో అధికంగా లభిస్తాయి. బరువు తగ్గడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి.

4. క్యాబేజీ:

క్యాబేజీలో ఫైబర్ శాతం ఎక్కువ. కేలరీల శాతం చాలా తక్కువ. కాబట్టి దీనిని సలాడ్‌లలో, సూప్‌లలో వాడడం వలన త్వరగా కడుపు నిండి బరువు నియంత్రణలో ఉంటుంది.

5. ముల్లంగి ఆకులు:

చాలా మంది కేవలం తెల్లని ముల్లంగి దుంపను మాత్రమే తింటారు. కానీ, ముల్లంగి ఆకులు దుంప కంటే కూడా చాలా రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పోషకాలు అధికం. ఈ ఆకులు ఫైబర్‌తో నిండి ఉంటాయి. కేలరీల శాతం తక్కువగా ఉండి బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

Next Story