- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health: ఖాళీ కడుపుతో ఇవన్నీ లాగించేస్తున్నారా? పెద్ద ప్రమాదంలో పడినట్లే!
ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సరైనా ఆహారపు అలవాట్లను పాటించటం లేదు. దీంతో చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే, ఏం తిన్నాం అనేది ముఖ్యం కాదు.. ఎప్పుడు తిన్నమన్నది ముఖ్యం అని చెబుతుంటారు. అంటే.. ఏ ఆహార పదార్థాలైనా సరై తినే సమయంలోనే తినాలి, లేదంటే ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే ఆహారం మన రోజు మొత్తంపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉదయాన్నే మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలంటారు. అంతేకాదు, రాత్రి తిన్న తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే వరకు కడుపు ఖాళీగా ఉంటుంది, కాబట్టి పరగడుపున అంటే ఖాళీ పొట్టతో మొదట ఏమి తింటున్నారో దానిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
ఖాళీ కడుపుతో తినకూడని ఆహార పదార్థాలు
సాధారణంగా ఉదయాన్నే సులభంగా జీర్ణమయ్యే ఆహారాల్నే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పరగడపున తినకూడని ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీంతో కడుపు నొప్పి, వికారం, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.
స్పైసీ ఫుడ్: చాలా మంది రాత్రి మిగిలిన బిర్యానీ, చికెన్, మటన్ వంటి వాటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటుంటారు. అయితే, ఇది చాలా ప్రమాదమంటున్నారు నిపుణులు. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కారం, మసాల ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఖాళీ కడుపుతో తినవద్దు.
సిట్రస్ ఫ్రూట్స్: పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ, నారింజ, గ్రేప్ ఫ్రూట్, బత్తాయి, ఉసిరి, నిమ్మ, టమాటాలు వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవి. వీటిని ఖాళీ కడుపుతో తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తింటే కడుపులో యాసిడ్ ఏర్పడుతుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కడుపు నొప్పి, ఎసిడిటీ, పుల్లటి తేన్పులు, వాంతులు వచ్చే అవకాశం ఉంది.
కెఫిన్: మనలో చాలా మందికి పొద్దున్నే లేవగానే కాఫీ లేదా టీ తాగడం అలవాటు ఉంటుంది. అయితే, ఇందులో ఉండే కెఫిన్ కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.
అధిక చక్కెర కలిగిన పదార్థాలు: స్వీట్లు, కేకులు, చాక్లెట్లు, బిస్కెట్లు వంటి అధిక చక్కెర గల ఆహారాలు ఖాళీ కడుపుతో తింటే.. కడుపులోని ఫ్రక్టోజ్‌తో ఓవర్‌లోడ్ అవుతాయి. తద్వారా శరీరంలోని ఇన్సులిన్ విభాగం కఠినంగా మారుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టంగా మారుతుంది. అలాగే, కూల్ డ్రింక్స్ తాగటం వల్ల కూడా గ్యాస్, పొట్ట ఉబ్బరానికి కారణమవుతాయి.
పెరుగు: ఇందులో ప్రోబయోటిక్ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ దంతాలతో పాటు మొత్తం శరీరంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో తింటే ఇందులోని యాసిడ్లు మీ కడుపులోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి, ఏమీ తినక ముందు పెరుగు తీసుకోవడం అసిడిటీకి కారణమవుతుంది.
వేయించిన పదార్థాలు: ముఖ్యంగా వేసవిలో ఉదయం పూట ఆయిల్ ఫుడ్ తినడం మీ శరీరానికి హానికరం. పూరీ, సమోసా, స్నాక్స్ ఇంకా బాగా వేయించిన ఆహార పదార్థాల్లో అధిక మొత్తంలో కొవ్వు, నూనెలు ఉండటం వల్ల ఇవి తింటే కడుపు బరువుగా మారుతుంది. వేడి వాతావరణ పరిస్థితుల్లో డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు.
Read More..
మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. అవేంటంటే..?






