- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దంచికొడుతున్న ఎండలు.. నీళ్లు అతిగా తాగుతున్నారా? అయితే ప్రమాదంలో పడినట్లే!
ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు (Temperatures) మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ క్రమంలో ఆరోగ్యం (Health) పట్ల సరైనా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయటికి వెళ్లకూడదని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, సరైనా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఇక వైద్యులు చెప్పకపోయినా ఎండకాలంలో ప్రతి ఒక్కరు నీరు (Water) ఎక్కువగానే తాగుతుంటారు. బయటి నుంచి ఇంటికి రాగానే ముందుగా నీళ్లు తాగుతారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన కూడా వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్తుంటారు. ఇది మంచి అలవాటే.. కానీ, ఎక్కువ నీరు తాగినా ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా రోజు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలని చెబుతుంటారు. అయితే, వాస్తవానికి ఒక మనిషి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలనేదానికి స్పష్టమైన లెక్కలు లేవు. కానీ వారు ఉండే భౌగోళిక పరిస్థితులు, ఎండల తీవ్రత అంశాల ఆధారంగా ఒక మనిషి ఎన్ని నీళ్లు తాగాలనేది ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనిషి శరీరంలో తాగు నీటి పరిమాణం అందరిలోనూ ఒకే విధంగా ఉండదని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్పెషల్ హెల్త్ రిపోర్ట్ చెబుతోంది. ఒక మనిషి జీవనశైలి, పనిప్రదేశం, ఉష్ణోగ్రతలతో పాటు ఆరోగ్య సమస్యలు తీసుకునే మందుల ఆధారంగా మంచి నీటిని తీసుకోవాలని ఈ నివేదిక పేర్కొంది.
ఇక రాత్రి నిద్రపోయి ఉదయం నిద్రలేచే సరికి ఓ మనిషి శరీరంలో నీటి నిల్వలు తగ్గుతాయి. అందువల్ల ఉదయాన్నే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవాలని అంటారు. సాధారణంగా మూత్రం కొద్దిగా లేత పసుపు రంగులో ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే మూత్రం రంగు మారుతుంది. ఆ విషయాన్ని గుర్తించి తగినన్ని నీళ్లు తీసుకోవాలి. ఇక వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. కార్యాలయాల్లో పనిచేసే వారైతే రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగాలి. అదే తీవ్రమైన ఎండలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారి శరీరం నుంచి చెమట రూపంలో నీటి నిల్వలు బయటికి పోతాయి. కాబట్టి అలాంటి వారు రోజుకూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి.
అయితే, నీళ్లు అతిగా తాగినా ప్రమాదమే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైన దానికంటే అధికంగా నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం 'ఇన్‌టాక్సికేషన్'కు గురవుతుందని చెబుతున్నారు. అంటే అధిక మోతాదులో తీసుకునే నీళ్లను కిడ్నీలు సమర్థంగా వడపోయలేవు. అలాగే, శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గి మెదడు దెబ్బతిని మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లే ముప్పు ఉందంటున్నారు. అలాగే, పొటాషియం స్థాయిలు కూడా తగ్గి కాళ్లలో మంట, ఛాతీలో నొప్పి లాంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.
గమనిక: ఈ సమాచారాన్ని ఇంటర్నెట్, పలు నివేదికలు ఆధారంగా అందించబడుతుంది. దీనిని 'దిశ' ధృవీకరించలేదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.






