బాత్రూమ్‌లో పాటలు పాడుతూ యూరిన్ చేస్తున్నారా? బీ కేర్‌ఫుల్

by Sujitha Rachapalli |

బాత్రూమ్‌లో యూరిన్ చేసేటప్పుడు పాటలు పాడుతున్నారా? ఈ అలవాటు చాలా మందికి ఉండొచ్చు.. కానీ దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. యూరిన్ చేస్తున్నప్పుడు నోరు తెరిచి పాటలు పాడితే సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా, వైరస్‌లు)

బాత్రూమ్‌లో పాటలు పాడుతూ యూరిన్ చేస్తున్నారా? బీ కేర్‌ఫుల్
X

దిశ, వెబ్ డెస్క్: బాత్రూమ్‌లో యూరిన్ చేసేటప్పుడు పాటలు పాడుతున్నారా? ఈ అలవాటు చాలా మందికి ఉండొచ్చు.. కానీ దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. యూరిన్ చేస్తున్నప్పుడు నోరు తెరిచి పాటలు పాడితే సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా, వైరస్‌లు) నోట్లోకి ప్రవేశించవచ్చని చెప్తున్నారు. అయితే ఈ అవకాశం చాలా తక్కువైనా జాగ్రత్తగా ఉండమంటున్నారు. ముఖ్యంగా బాత్రూమ్‌లో పరిశుభ్రత లేకపోతే, ఉపరితలాలపై సూక్ష్మక్రిములు ఉండవచ్చు.

1. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడం, ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవడం వల్ల సూక్ష్మక్రిముల వ్యాప్తిని నివారించవచ్చు.

2. బాత్రూమ్‌లో ఫ్లష్ వాల్వ్ టాయిలెట్‌లు ఉపయోగిస్తే.. ఫ్లష్ చేసినప్పుడు సూక్ష్మ నీటి బిందువులు గాలిలోకి వ్యాపించవచ్చు (ఏరోసోలైజేషన్). ఇవి సూక్ష్మక్రిములను కలిగి ఉండవచ్చు. కానీ నోట్లోకి ప్రవేశించే అవకాశం చాలా తక్కువ.

3. బాత్రూమ్‌లో శ్వాస తీసుకోవడం ద్వారా లేదా అపరిశుభ్రమైన ఉపరితలాలను తాకడం ద్వారా సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోండి. మంచి వెంటిలేషన్ ఉన్న బాత్రూమ్‌ను ఉపయోగించండి.

Next Story