పరగడుపునే మూడు వేప ఆకులు.. ఎన్ని లాభాలో తెలుసుకోండి

by Naga Rani Yarlagadda |

వేప ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని (Neem Leaves Health Benefits) ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు.

పరగడుపునే మూడు వేప ఆకులు.. ఎన్ని లాభాలో తెలుసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: వేప ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని (Neem Leaves Health Benefits) ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉండటంతో ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వేప ఆకుల రసం రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మొటిమలు, చర్మ సంబంధిత రోగాల నివారణకు వేప ఆకులు ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

మధుమేహంతో బాధపడుతున్న వారికి వేప ఆకులు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. వేపలోని ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఇన్సులిన్‌కు ప్రతిస్పందించేలా చేస్తాయి. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవచ్చు. వేప ఆకులను నమలడం వల్ల నోటి పరిశుభ్రత పెరుగుతుంది. దంతాల్లో కుహరాలు నివారించబడతాయి. దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్ల వాపు తగ్గి దంతాలు బలపడతాయి.

వేప కాలేయాన్ని శుద్ధి చేయడంలో కూడా కీలకంగా పనిచేస్తుంది. కాలేయ ఆరోగ్యం మెరుగవడం వల్ల శరీరం మొత్తం శ్రేష్ఠంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు వివరించారు. వేపలోని ఔషధ గుణాలు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా.. దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడతాయని వారు తెలిపారు.

Next Story