Alert: చికెన్ తింటే GBS వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?

by D.Reddy |   ( Updated:2025-02-09 08:38:44.0  )
Alert: చికెన్ తింటే GBS వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులగా మహారాష్ట్ర ప్రజలను 'గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS)' వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. వందకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడగా.. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక శనివారం తెలంగాణలోనూ తొలి GBS మరణం నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా చికెన్ తింటే ఈ వైరస్ బారిన పడుతారంటూ సోషల్ మీడియాలో విపరీతం ప్రచారం నడుస్తోంది. దీనిపై వైద్యులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏంటి ఈ వైరస్?

కలుషిత ఆహారం, బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గిలియన్ బార్ సిండ్రోమ్‌ సోకుతుంది. ఈ వైరస్ బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ఈ వ్యాది సోకిన వారు పూర్తిగా కోలుకోవడానికి 4 వారాల నుంచి 6 నెలల వరకు సమయం పట్టవచ్చు.

చికెన్ తింటే ఈ వైరస్ సోకుతుందా?

ఇక శీతాకాలంలో పక్షులకు బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదం ఉంది. ఈక్రమంలో చికెన్ తినడం వల్ల GBS వైరస్ వస్తుందని ప్రచారం జోరందుకుంది. ఇన్ఫెక్షన్ సోకిన చికెన్ తినడం వల్ల GBS వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి అయినప్పటికీ, దానికి కారణమయ్యే బాక్టీరియా, కాంపిలోబాక్టర్ జెజునమ్, చికెన్ లేదా మాంసంలో కనిపిస్తుందని, సగం ఉడికిన, పచ్చి ఆహారాన్ని తినడం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి వ్యక్తి అనారోగ్యానికి గురవుతారని చెబుతున్నారు. ఈ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ వ్యాధి వ్యాప్తికి ఇది ఒక కారణం కావచ్చని అంటున్నారు.

Advertisement
Next Story