- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ పిల్లాడు అతి చురుగ్గా ఉన్నాడా? డిజార్డర్‌కు సంకేతం కావొచ్చు?
మీ పిల్లాడు అతి చురుగ్గా ఉన్నాడా? ఒక్క చోట స్థిరంగా ఉండకుండా గందరగోళంగా ప్రవర్తిస్తున్నాడా? వారి బిహేవియర్ సాధారణమే కావచ్చు

దిశ, ఫీచర్స్ : మీ పిల్లాడు అతి చురుగ్గా ఉన్నాడా? ఒక్క చోట స్థిరంగా ఉండకుండా గందరగోళంగా ప్రవర్తిస్తున్నాడా? వారి బిహేవియర్ సాధారణమే కావచ్చు కానీ ఒక్కోసారి తల్లిదండ్రుల మనసులో భయం కలగొచ్చు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే సందేహం కలగొచ్చు. ఎందుకంటే కొంత మంది పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్(ADHD) ఉండొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా పిల్లలను ప్రభావితం చేసే సాధారణ న్యూరోడెవలప్‌మెంటల్ (neurodevelopmental) పరిస్థితి. ADHD సాధారణంగా శ్రద్ధ లోపం (inattention), అతి చురుకుదనం (hyperactivity), ఆవేశపూరిత ప్రవర్తన (impulsivity) ద్వారా గుర్తించబడుతుందని చెప్తున్నారు నిపుణులు. ఇది పిల్లల రోజువారీ జీవితం, పనులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి గుర్తించి ట్రీట్మెంట్ అందించాలి. మరి అలాంటి ప్రారంభ సంకేతాలేంటో చూద్దాం.
1. ఫోకస్ చేయడంలో ఇబ్బంది
ADHD ఉన్న పిల్లలు ఒక్క పని మీద ఫోకస్ చేయలేరు. ఎక్కువసేపు ఏ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయలేరు. ముఖ్యంగా మానసిక శ్రమ అవసరమయ్యే పనుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. స్కూల్ వర్క్, ఇతర కార్యకలాపాల్లో తరచుగా అజాగ్రత్తగా ఉండి.. తప్పులు చేస్తారు.
2. రెస్ట్‌లెస్.. అశాంతి
ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు ఒక్క చోట కూర్చోకుండా.. పరుగెడుతూనే ఉంటరు. అనవసరంగా ఎక్కడో ఒక చోట ఎక్కడం, నిశ్శబ్దంగా ఆడలేకపోవడం వంటివి చేస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే అది ADHD సంకేతం కావచ్చు. హైపరాక్టివిటీ లక్షణాలు సాధారణంగా నాలుగు సంవత్సరాల వయసులో స్పష్టంగా కనిపించడం మొదలవుతాయి.
3. ఆవేశపూరిత ప్రవర్తన
ఏదైనా చేయమంటే అడ్డు చెప్పడం.. మాట్లాడుతుంటే అంతరాయం కలిగించడం.. ఆడుతున్నప్పుడు వారి వంతు కోసం వెయిట్ చేయకపోవడం.. పర్యవసానాలు ఆలోచించకుండా త్వరగా నిర్ణయం తీసుకోవడం చేస్తారు. ఇవి ఆవేశపూరిత ప్రవర్తనకు ఉదాహరణలు.
4. సూచనలు పాటించరు
ఏదైనా పని చెప్తే దాన్ని పాటించకుండా డిస్ట్రాక్ట్ అవుతుంటారు. మధ్యలో పనులు మరచిపోవడం.. సులభంగా దృష్టి మళ్లించబడడం.. పనులు పూర్తి చేయలేకపోవడం వంటివి చేస్తారు. దీంతో విషయం మళ్లీ మళ్లీ చెప్పాల్సి రావడం జరుగుతుంది. ఇవి ADHD సాధారణ లక్షణాలు.
5. మూడ్ స్వింగ్స్
ADHD ఉన్న పిల్లలు తరచుగా తీవ్రమైన భావోద్వేగాలు అనుభవిస్తారు. చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంటారు. సహనం చాలా తక్కువ. ఈ భావోద్వేగ అస్థిరత (emotional dysregulation) కూడా ADHDతో సంబంధం ఉన్న లక్షణం.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






